MLC Kavitha: ఎమోష‌న‌ల్ అయిన క‌విత‌.. చాలా రోజుల త‌ర్వాత హ్యాపీ, ఎందుకంటే

Published : May 20, 2025, 04:18 PM ISTUpdated : May 20, 2025, 04:19 PM IST
MLC Kavitha

సారాంశం

గ‌త కొన్ని రోజులుగా కేసులు, విచారణ‌లు, అరెస్టులు.. ఇలా ఎన్నో టెన్ష‌న్స్‌తో ఉన్న ఎమ్మెల్సీ క‌విత ప్ర‌స్తుతం హ్యామీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత‌కీ క‌విత అంత‌లా సంతోషంగా ఉండ‌డానికి కార‌ణం ఏంటంటే.? 

అమెరికాలో క‌విత‌:

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యక్తిగతంగా ఒక తల్లిగా భావోద్వేగానికి లోనయ్యారు. తన పెద్ద కుమారుడు కల్వకుంట్ల ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్శిటీలో చదువు పూర్తిచేసుకొని డిగ్రీ పట్టా పొందిన సందర్భంగా ఆమె ఎమోషనల్‌ అయ్యారు. చాలా రోజుల త‌ర్వాత క‌విత ముఖంలో చిరున‌వ్వు క‌నిపించింది.

డిగ్రీ పట్ల గర్వంతో కవిత భావోద్వేగం:

గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి అమెరికా వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన కవిత, తన కొడుకు డిగ్రీ పట్టా అందుకుంటున్న దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి గుండెల్లో ఆనందం వెల్లి విరిసింది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోల‌ను క‌విత సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

ఫొటోల‌తో పాటు "నీ చిన్న చేతిని పట్టుకొని నడిపిన రోజులు నుంచి, డిగ్రీ పట్టా తీసుకునే ఈ రోజు వరకు నీ ప్రయాణం అద్భుతమైంది. నువ్వు ఎంతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నావు. నీ విష‌యంలో మాకు గ‌ర్వంగా ఉంది. " అంటూ రాసుకొచ్చారు.

 

 

కోర్టు అనుమతితో అమెరికా ప్రయాణం:

కవిత ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల నేపథ్యంలో కోర్టు అనుమతితో అమెరికా వెళ్లారు. డిగ్రీ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా సీబీఐ కోర్టు ఆమెకు 7 రోజుల ప్రయాణ అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 23న ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గద్దర్ అన్నకు కార్ కొనించానని చెప్పడానికి సిగ్గు లేదు..! | Kavitha Aggressive Words On Pawan Kalyan
చెరువు కబ్జా పై Pawan Kalyan కు కౌంటర్ ఇచ్చిన Kalvakuntla Kavitha | Asianet News Telugu