కవిత పుట్టిన రోజు.. 60 అడుగుల చిత్రపటం ఏర్పాటు..!

Published : Mar 13, 2021, 11:18 AM ISTUpdated : Mar 13, 2021, 11:21 AM IST
కవిత పుట్టిన రోజు.. 60 అడుగుల చిత్రపటం ఏర్పాటు..!

సారాంశం

మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు శైలేష్ కులకర్ణి కవిత చిత్రాన్ని వేశారు. ఈ చిత్రం వేసేందుకు 20 గంటలకు పైగా కళాకారులు శ్రమించారు.   

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రవీంద్రభారతిలో కల్వకుంట్ల కవిత 60 అడుగుల చిత్రాన్ని ఏర్పాటు చేశారు. 

ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై 60 అడుగుల భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ యువనేత కవిత మీద అభిమానంతో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు శైలేష్ కులకర్ణి కవిత చిత్రాన్ని వేశారు. ఈ చిత్రం వేసేందుకు 20 గంటలకు పైగా కళాకారులు శ్రమించారు. 

కాగా.. క‌విత జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. నా ప్రియ‌మైన సోద‌రికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. నువ్వు నా స్నేహితురాలిగా ఎన్నో ఏండ్ల నుంచి క‌లిసి ఉన్నావు. అన్నాచెల్లెలుగా మ‌న ప్ర‌త్యేక అనుబంధం క‌ల‌కాలం కొన‌సాగుతూనే ఉంటుంది. నీ పుట్టిన రోజు అత్యంత అద్భుతంగా, అందంగా సాగాల‌ని ఆకాంక్షిస్తున్నాను అని సంతోష్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా క‌విత మొక్క‌లు నాటిన దృశ్యాల‌ను వీడియో రూపంలో సంతోష్ కుమార్ షేర్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?