వనస్థలిపురంలో భర్తను చంపిన భార్య: దిమ్మ తిరిగే విషయాలు వెల్లడి

By telugu teamFirst Published Mar 13, 2021, 8:12 AM IST
Highlights

హైదరాబాదులోని వనస్థలిపురంలో భర్తను చంపిన భార్య హత్య కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వనస్థలిపురంలో నౌసిన్ బేగం అనే మహిళ భర్త గగన్ అగర్వాల్ ను హత్య చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో భర్తను చంపిన భార్య కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. భర్త గగన్ అగర్వాల్ ను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన నౌసీన్ బేగం కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గగన్ అగర్వాల్ తో పెళ్లికి ముందు నౌసిన్ బేగం ఓ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం మేరకు తన ముగ్గురు కూతుళ్ల పెళ్లికి ఆస్తి ఇచ్చేందుకు గగన్ అగర్వాల్ నిరాకరించినట్లు సమాచారం. దాంతో తన కూతురిపై అగర్వాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణ చేస్తోందని భావిస్తున్నారు. 

తన ప్రియుడు సునీల్ తివారీని భయ్యా అని సంబోధిస్తూ మరో రకంగా కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్లు భావిస్తున్నారు. సునీల్ తివారీతో కలిసి భర్త గగన్ అగర్వాల్ ను హత్య చేసిన నౌసిన్ బేగం అంతకు ముందు కూడా పలు డ్రామాలు ఆడినట్లు భావిస్తున్నారు. 

తనను అపహరించడానికి ప్రయత్నిస్తున్నారని, తన వెంట్రుకలు కోసేశారని రెండు రోజుల పాటు నౌసీన్ బేగం భర్త అగర్వాల్ కు సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన అగర్వాల్ కు అటువంటి ఛాయలేమీ కనిపించలేదు. దీంతో అతనికి భార్యపై అనుమానం వచ్చింది. తన మిత్రుడు సునీల్ తివారీ మీద అతను ఓ కన్నేసి ఉంచాడు. సునీల్ తివారీతో నౌసిన్ బేగం వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అతను అనుమానించాడు. దీంతోనే అతను మద్యానికి బానిస అయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా భార్యతో తరుచుగా గొడవ పడుతూ వచ్చాడు. ఆమెకు ఆస్తి ఇవ్వడానికి నిరాకరించాడు. 

గత నెల 7వ తేదీన సునీల్ తివారీ గగన్ అగర్వాల్ ను గట్టిగా పట్టుకోగా నౌసీన్ బేగం అతని ఛాతీ కుడిభాగంపై ఐదుసార్లు కత్తితో పోడిచింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. గత నెల 11, 12 తేదీల్లో గగన్ అగర్వాల్ సోదరి కూతురి పెళ్లి జరిగింది. నౌసిన్ బేగం తన పెద్ద కూతురికి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువకుడి మొబైల్ నుంచి గగన్ అగర్వాల్ పేరిట పెళ్లి హాజరు కాలేనని మెసేజ్ పెట్టింది. దాంతో నౌసిన్ బేగంపై అగర్వాల్ కుటుంబ సభ్యులు ఒత్తిడి పెట్టారు. చివరకు గగన్ అగర్వాల్ సోదరుడు అకాశ్ అగర్వాల్ ఫిబ్రవరి 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎల్బీ నగర్ పోలీసులు కేసును వనస్థలిపురం పోలీసులకు బదిలీ చేశారు. 

భర్తను హత్య చేసిన తర్వాత నౌసిన్ బేగం కొద్ది రోజులు హైదరాబాదు పాతబస్తీలోని తన కుటుంబ సభ్యుల వద్ద ఉంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయండోత ఫోన్ స్విచాఫ్ చేసి ఢిల్లీ వెళ్లింది. అక్కడి నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాకు వెళ్లింది. అక్కడి నుంచి మరో మొబైల్ తో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తరుచుగా అలా ఫోన్లు చేస్తూ వచ్చింది. కుటుంబ సభ్యుల సహాయం తీసుకుని ఫోన్ సిగ్నల్ ఆధారంగా నౌసీన్ బేగం ఆచూకి కనిపెట్టి ఆమెను పిలిపించి విచారించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

click me!