BRS: బీఆర్ఎస్ ఎన్నారైల బృందంతో ఎమ్మెల్సీ క‌విత‌ భేటీ.. ఎన్నిక‌ల ప్ర‌చారం పై చ‌ర్చ

By Mahesh Rajamoni  |  First Published Sep 27, 2023, 6:16 PM IST

Hyderabad: బీఆర్ఎస్ ఎన్నారైల బృందంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ఎన్నారైలు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలలో అమెరికాలో ఎన్నారైలందరు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా  బీఆర్ఎస్ అమ‌లు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలలోకి తీసుకెళ్తామని చెప్పారు. అలాగే, ఎన్నారైల తరపున ఎన్నికల ప్రచార ప్రణాలికను సిద్ధం చేసిన‌ట్టు పేర్కొన్నారు. వివిధ దేశాల ఎన్నారైలు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారములో పాల్గొంటారనీ, అలాగే సోషల్ మీడియా క్యాంపెయిన్  అండ్ టెలీఫోనిక్ కాంపెయిన్ లతో ప్రజల్లోకి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పథకాలను తీసుకెళ్తామని చెప్పారు.
 


BRS MLC Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ ఎన్నారైల బృందంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట్ చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ తీసుకువ‌చ్చిన మహిళా బిల్లుపై క‌విత‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో రాబోయే ఎన్నికల నేప‌థ్యంలో ఎన్నారైల ప్రచార ప్రణాలికను ఆమెకు వివ‌రించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని బీఆర్ఎస్ ఎన్నారైల బృందం పేర్కొంది. 

అందుకే నేడు మహేష్ బిగాలా అధ్వ‌ర్యంలో వివిధ దేశాల ఎన్నారైలు  అమెరికా నుంచి మహేష్  తన్నీరు (బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్విసోరీ  చైర్), చందు  తల్లా (బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్), హరీష్ రెడ్డి, సురేష్లు ఎమ్మెల్సీ కవితను క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. అలాగే  వివిధ అంశాలపై వారు చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎన్నారైలు మాట్లాడుతూ మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని పోరాటం చేశార‌ని పేర్కొన్నారు. దాని ఫలితంగానే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారని చెప్పారు.

Latest Videos

undefined

క‌విత పోరాటంతో మ‌హిళా బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో బీఆర్ఎస్ ఎన్నారై నాయ‌కులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం ఓబీసీలకు, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు చేపట్టాలనీ, అదే పోరాట పటిమతో ముందుకు వెళ్లాలని కోరారు. రిజర్వేషన్లకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ ఎన్నారైల బృందంతో ఎమ్మెల్సీ క‌విత‌ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌ను సైతం చ‌ర్చించిన‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు తెలిపారు. ఈ భేటీలో రాబోయే ఎన్నికల నేప‌థ్యంలో  ఎన్నారైల ప్రచార ప్రణాలికను ఆమెకు వివ‌రించారు. బీఆర్ఎస్ ఎన్నారైలు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలలో అమెరికాలో ఎన్నారైలందరు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా  బీఆర్ఎస్ అమ‌లు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలలోకి తీసుకెళ్తామని చెప్పారు. అలాగే, ఎన్నారైల తరపున ఎన్నికల ప్రచార ప్రణాలికను సిద్ధం చేసిన‌ట్టు పేర్కొన్నారు. వివిధ దేశాల ఎన్నారైలు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారములో పాల్గొంటారనీ, అలాగే సోషల్ మీడియా క్యాంపెయిన్  అండ్ టెలీఫోనిక్ కాంపెయిన్ లతో ప్రజల్లోకి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పథకాలను తీసుకెళ్తామని చెప్పారు.

click me!