హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. నగరానికి భారీ వర్ష సూచన వుందని జాగ్రత్తగా వుండాలని సూచిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. నగరానికి భారీ వర్ష సూచన వుందని జాగ్రత్తగా వుండాలని సూచిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతుందని తెలిపింది. ఇప్పటికే మంగళవారం సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, అశోక్ నగర్, మియాపూర్, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠీ, బషీర్‌బాగ్, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
రోడ్ల మీదకు వర్షపు నీరు పోటెత్తుతూ వుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, వనపర్తి, జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.