అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ.. దేశానికే తెలంగాణ రోల్‌మోడ‌ల్‌గా మారిందన్న సండ్ర

By Sumanth Kanukula  |  First Published Feb 4, 2023, 11:36 AM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నేరుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. 


తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నేరుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. 

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని అన్నారు. కంటివెలుగు లాంటి కార్యక్రమాన్ని పంజాబ్‌, ఢిల్లీలో చేపడతామని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ప్రకటించారని చెప్పారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలుచేసి రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. దళితులు ఆత్మగౌరవంతో బతికేలా దళితబంధు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన పార్లమెంట్‌ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరుపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Latest Videos

ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశపూర్వకమైనవేనని అన్నారు. దేశంలో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ అభివృద్ది జరగడం లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ది, హైదరాబాద్‌ ప్రగతిని అడ్డుకునేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అదానీ లాంటి  వాళ్లకు కేంద్రం లబ్ది చేకూరుస్తోందని విమర్శించారు. 

click me!