
పుష్ప చిత్రంలోని ‘ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ’ పాటకు (Pushpa item song) ఎంత క్రేజ్ వచ్చిందో అదే స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి. పాట సాహిత్యంలో కొన్ని పదాలు పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ కొందరు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట చుట్టూ మరో వివాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన పుష్ప చిత్రం (Pushpa Movie) ప్రెస్‌మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) చేసి వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja singh) తీవ్రంగా ఖండించారు. దేవుళ్ల పాటలు, ఐటమ్ సాంగ్స్ ఒకటే అనడం సరికాదని అన్నారు. హిందూ సమాజానికి దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేవిశ్రీ ప్రసాద్‌ను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.
ఇటీవల జరిగిన పుష్ప ప్రమోషన్స్‌లో ఐటెం సాంగ్స్ గురించి మాట్లాడిన.. తనకు అన్నీ పాటలు ఒకటేనని చెప్పారు. ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ సాంగ్సే అన్నారు. తాను కేవలం ట్యూన్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఐటెం సాంగ్ అనేది తనకు మాత్రం కాదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను కంపోజ్ చేసిన ఆర్య 2లో రింగ రింగ సాంగ్, పుష్పలోని ఊ అంటావా మామ పాటలను డివోషనల్ లిరిక్స్‌తో పాడి వినిపించారు.
Also read: Pushpa row: ఏపీలో పుష్ప థియేటర్స్ మీద ఫాన్స్ ఎటాక్,లాఠీ ఛార్జి
అలాగే సంగీతం మనం తీసుకునే దానిని బట్టి ఉంటుందన్నారు. ‘సంతోషకరమైన విషయం ఏమిటంటే.. ఊ అంటావా మామ.. వైరల్ అయ్యాక లెజండరీ సింగర్ శోభరాజు గారు గీతా జయంతి సందర్భంగా అంటావా మాధవ.. ఊ ఊ అంటావా అని పాడారు. దానిని చాలా మంది షేర్ చేస్తున్నారు. శోభరాజ్ గారి వల్ల ఈ జనరేషన్‌కు అన్నమయ్య కీర్తనలు పాపులర్ అయ్యాయ. ఆమెకు థాంక్స్ చెప్పుకుంటున్నాను’ అని దేవిశ్రీ ప్రసాద్. అది మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్ అని పేర్కొన్నారు.
తాజాగా, దేవిశ్రీ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రాజా సింగ్.. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై దేవిశ్రీ ప్రసాద్ గానీ, పుష్ప టీమ్ గానీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.