Hyderabad : బాధితురాలి వెంటపడుతున్న పోకిరీ పోలీస్ ... భారీ మూల్యం చెల్లించుకున్నాడుగా...

By Arun Kumar P  |  First Published Dec 27, 2023, 10:18 AM IST

న్యాయం కోసం వెళ్ళిన బాధిత మహిళపైనే వేధింపులకు దిగాడో పోకిరీ పోలీస్. బాధ్యతాయుతంగా వుండాల్సిన వాడు బరితెగించి చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 


హైదరాబాద్ : మహిళలను ఎవడైనా ఆకతాయి వేధిస్తుంటే పోలీసులు బుద్ది చెబుతుంటారు. అలాంటిది ఓ పోలీసే న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన మహిళను  వేధించిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు పోకిరి పోలీస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.  

వివరాల్లోకి వెళితే... మియాపూర్ పోలీస్ స్టేషన్ లో గిరీష్ కుమార్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈ పోలీస్టేషన్ పరిధిలో ఓ బ్యూటీపార్లర్ నిర్వహించే మహిళ న్యాయం కోసం ఎస్సై గిరీష్ ను కలిసింది. వ్యాపారం పేరుతో నమ్మించి తన స్నేహితుడు రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో చీటింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు ఆమెకు స్నేహితుడి నుండి డబ్బులు ఇప్పించారు. దీంతో ఈ కేసు ముగిసింది. 

Latest Videos

తన డబ్బులు వసూలు కావడంతో సదరు బ్యుటీషియన్ సంతోషిస్తుండగా మరో సమస్య వచ్చిపడింది. తన సంతోషానికి కారణమైన పోలీసే వేధింపులకు దిగి బాధపెట్టడం ప్రారంభించాడు. కేసు విచారణ సమయంలో ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న ఎస్సై గిరీష్ తరచూ ఫోన్ చేయడం... అసభ్యంగా మాట్లాడటం చేయసాగాడు. అంతటితో ఆగకుండా ఆమె వెంటపడుతూ పోకిరీలా వ్యవహరించసాగాడు. ఎస్సై చేష్టలతో విసిగిపోయిన బ్యూటీషియన్ సైబరాబాద్ కమీషనర్ అవినాశ్ మహంతికి ఫిర్యాదు చేసింది. 

Also Read  TSRTC: పురుషులకు ప్రత్యేక బస్సులు?.. ‘మహాలక్ష్మీ’తో బస్సుల్లో రద్దీ.. ప్రత్యామ్నాయ ఆలోచనల్లో ఆర్టీసీ

బాధ్యతాయుతంగా వుండాల్సిన ఎస్సై ఇలా బరితెగించి బాధిత మహిళను వేధించడాన్ని సిపి సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులతో విచారణ చేయించగా ఎస్సై బ్యూటీషియన్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నది నిజమేనని తేలింది. దీంతో మియాపూర్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు అవినాష్ మహంతి ఆదేశాలతో సైబరాబాద్ సిపి కార్యాలయం సస్పెన్షన్ వేటు వేసింది. 

click me!