వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

First Published Nov 20, 2016, 9:45 AM IST
Highlights
  • భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • లంబసింగిలో మైనస్ డిగ్రీలకు...
  • మెదక్, సంగారెడిలో 9.7 డిగ్రీలు ఉష్ణోగ్రత

 

పెద్ద నోట్ల రద్దుతో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది.

రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎనిమిది డిగ్రీల మేర తగ్గుదల నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

 

ఆంధ్రా కశ్మీర్ గా పేరొందిన విశాఖ ఏజెన్సీలోని లంబసింగిలో అప్పుడే ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోయాయి.  ఇక్కడ ఉదయం 10 దాటినా జనాలు భయటకి రావడానికి భయపడిపోతున్నారు.

 

విశాఖ ఏజెన్సీ, పాడేరు, విజయనగరంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

కాగా, తెలంగాణ లో కూడా ఈసారి చలి వణికిస్తుంది. రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలులతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు అధికారులు వివరించారు. 


వికారాబాద్ జిల్లాలోనూ 10.1 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. హైదరాబాద్‌లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలో నాలుగుడిగ్రీల తగ్గుదల నమోదైంది. గతంలో 2012 నవంబర్18న మెదక్‌లో అత్యల్పంగా 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, అదే ఏడాది నవంబర్ 19న హన్మకొండలో 13.5 డిగ్రీలుగా నమోదైంది.

 

చలిగాలుల తీవ్రత పెరిగినందున ఈ నెల చివరినాటికి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపో యే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆది, సోమవారాల్లో చలిగాలుల తీవ్రత ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలో పెరగనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. హైదరాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో మరో రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నదన్నారు. పగలంతా వేడిగా ఉంటున్నా రాత్రికి చలి వణికిస్తున్నది.

 

click me!