హైద్రాబాద్‌లో దారుణం: అన్న కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు, బాలిక మృతి

Published : Oct 01, 2021, 09:35 AM IST
హైద్రాబాద్‌లో దారుణం:  అన్న కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు, బాలిక మృతి

సారాంశం

హైద్రాబాద్ మియాపూర్ హనీఫ్ కాలనీలో అన్న కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు బాబాయ్. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు నందిని  మరణించింది. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

హైదరాబాద్:హైద్రాబాద్ (hyderabad) మియాపూర్  (miyapur)లో  దారుణం చోటు చేసుకొంది. అన్న కూతురిపై  కిరోసిన్ పోసి నిప్పంటించాడు దుండగుడు.  తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం నాడు మరణించింది.హైద్రాబాద్ మియాపూర్ హనీఫ్ కాలనీలో(hanif colony) ఈ ఘటన చోటు చేసుకొంది.  నందిని  (Nandini)అనే బాలిక  కీసర (keesara residential school) గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది.ఆన్ లైన్ క్లాస్ (online class)ఉండడంతో  తండ్రి ఆమెకు  సెల్ ఫోన్  ఇప్పించాడు. అయితే ఆన్ లైన్ క్లాస్ ల కోసం కొనుగోలు చేసిన మొబైల్ (mobile) లో ఆమె తన సమీప బంధువుతో  చాటింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు కుటుంబసభ్యులు.  ఈ విషయాన్ని గుర్తించిన పేరేంట్స్ ఆమెను మందలించారు.  మొబైల్  సిమ్ కార్డును కూడ మార్చారు.

నిన్న నందిని తండ్రి ఇంట్లో లేని సమయంలో  బాబాయ్  ఇంటికి వచ్చాడు.  సమీప బంధువుతో ఛాటింగ్ విషయమై బాబాయ్ ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహనికి లోనైన బాబాయ్ తన వెంట తెచ్చుకొన్న కిరోసిన్ ను బాలికపై పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని గుర్తించిన తల్లి, స్థానికులు మంటలను ఆర్పివేశారు. అనంతరం ఆమె ఆసుపత్రికి తరలించారు.  తీవ్రంగా  గాయపడిన నందిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?