
దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ (Metro Rail) నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతడి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, మద్యం మత్తులో అతను మెట్రో స్టేషన్ మీది నుంచి దూకాడని కొందరు చెబుతున్నారు. అతన్ని చత్తీస్ ఘడ్, కువకొండ, పుల్ పహాడ్, దంతేవాడకు చెందిన భీమా(45) అని మలక్ పేట పోలీసులు చెబుతున్నారు. ఇతడు ఫుట్ పాత్ మీద నివాసం ఉంటున్నాడు. దిల్ సుఖ్ నగర్ బస్టాప్ వైపు నుంచి మెట్రో స్టేషన్ మొదటి ఫ్లోర్ ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకాడు.
తెలుగు అకాడమీ నిధుల స్కామ్: తవ్వుతున్న కొద్దీ.... మరో గోల్ మాల్ వెలుగులోకి..
దీంతో అతడి తల, ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న మలక్ పేట పోలీసులు 108 అంబులెన్స్ లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ లు పరిశీలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.