Huzurbad Bypoll: గెల్లుకు టీఆర్ఎస్ బీఫామ్, రూ.28లక్షల చెక్... అందజేసిన కేసీఆర్ (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 1, 2021, 9:32 AM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేయనున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు బీఫామ్ తో పాటు ఎన్నికల ఖర్చుకోసం రూ.28లక్షల చెక్ అందజేసారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ చేతులమీదుగా భీఫామ్ అందుకున్నారు.  మంత్రులు హరీష్రావు వేముల శ్రీకాంత్ రెడ్డి తో పాటు పార్టీ నాయకులు పెద్దిరెడ్డి కలసి ప్రగతి భవన్ కు వెళ్ళిన శ్రీనివాస్ కు కేసిఆర్ బీఫామ్ తో పాటు ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ ఫండ్ గా 28 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.  

ఈ సందర్భంగా హుజురాబాద్ లో మంచి మెజారిటీలో గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  ప్రజలకు ఎప్పుడూ ఇలాగే అందుబాటులో వుండాలని గెల్లును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు.

వీడియో

ఇక ఇప్పటికే ఉప ఎన్నికల షెడ్యూల్ రావడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బిజెపి నాయకులు ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ చాలారోజులుగా ప్రచారాన్ని చేపడుతుండగా ఎన్నికల షెడ్యూల్ తర్వాత మరింతగా ప్రచార ఊపు పెంచారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థి వేటలోనే వుంది.  

read more  కట్లు కట్టుకుని డ్రామాలకు సిద్ధం.. అచ్చం రఘునందన్ దారిలోనే, స్కెచ్ రెడీ: ఈటలపై కొప్పుల సంచలనం

మంత్రి హరీష్ రావు హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. గతకొంత కాలంగా హుజురాబాద్ లోనే మకాం వేసిన ఆయన టీఆర్ఎస్ లోకి భారీగా వలసలను ఆహ్వానిస్తున్నారు. గ్రామస్థాయి నాయకులతో సైతం స్వయంగా మాట్లాడి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఉద్యోగ, మహిళా సంఘాలతో మీటింగ్ లు, కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారాన్ని కూడా తనదైన స్టైల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ట్రబుల్ షూటర్ హరీష్.  

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఇటీవలే ఇక్కడ ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ (election notification) విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరిస్తారు.  అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 2న కౌంటింగ్ (counting)నిర్వహిస్తారు. 

 

click me!