పదమూడేళ్ల బాలిక మీద కన్నేసిన ఓ వ్యక్తి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి.. రెండు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ : అభం, శుభం తెలియని చిన్నారులపై కామాంధుల అకృత్యాలు ఆగడం లేదు. వయసుతో సంబంధం లేకుండా అమ్మాయి కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కూతురు వయసు, మనవరాలి వయసులో ఉన్న చిన్నారులన్న ఇంగితజ్ఞానం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. అలాంటి ఓ దారుణ ఘటన హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టలో వెలుగు చూసింది.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో ఓ చిన్నారిపై ఓ కీచకుడు దారుణానికి ఒడిగట్టాడు. సంజీవ్ కుమార్ (35)అనే ఓ కామాంధులు 13యేళ్ల మైనర్ పై కన్నేశాడు. అదును చూసి బాలికను బంధించి, నోట్లో గుడ్డలు కుక్కి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా రెండురోజులుగా బాలిక మీద అత్యాచారం చేస్తున్నాడు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రభుత్వ భూములు పంచుకున్నాయి: కిషన్ రెడ్డి
బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి.. మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా భయపడిపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లోని బోపాల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి నెలల తరబడి అత్యాచారం చేశారు. ఈ ఘటన శనివారం మధ్యప్రదేశ్ లోని షాజహనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మైనర్‌ను గతేడాది అక్టోబర్‌లో అభిషేక్ (పేరు మార్చాం) అనే 19 ఏళ్ల యువకుడు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటాననే సాకుతో.. నిందితుడు ఆమెను ఖాండ్వా వైపు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారు భోపాల్‌కు తిరిగి వచ్చినప్పుడు, ఆమె పరిస్థితి క్షీణించింది.
ఇది గమనించిన ఆమె తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లింది, బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెకు గర్భవతి అని చెప్పారు. దీంతో
అపహరణ, అత్యాచారం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.