హైదరాబాద్ హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం... కాపాడిన హిజ్రా..

Published : Jul 05, 2023, 07:03 AM ISTUpdated : Jul 05, 2023, 09:23 AM IST
హైదరాబాద్ హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం... కాపాడిన హిజ్రా..

సారాంశం

హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్ చేసిన దుండగులు ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారు దుండగులు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వారినుంచి తప్పించుకున్న బాలిక రోడ్డు మీదికి వచ్చి ఏడుస్తూ సహయం కోసం అర్ధించింది. అటుగా వెడుతున్న ఓ హిజ్రా బాలికను చూసి.. రక్షించి.. పోలీసులకు అప్పగించింది. 

ఈ కిడ్నాప్, అత్యాచారయత్నం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అడ్రస్ చెప్పాలంటూ బాలికను అడిగి.. మత్తుమందు స్ప్రే చేశారు. ఆ తరువాత బాలికను తీసుకుని ఔటర్ రింగ్ రోడ్డు మీదికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారు. నోరుమూసి బాలికను ఎత్తుకెళ్లారు. పొదల్లోకి తీసుకెళ్లి దాడికి ప్రయత్నించగా.. ప్రతిఘటించింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగో వారినుంచి తప్పించుకుని రోడ్డు మీదికి పరిగెత్తింది.

అక్కడ కనిపించినవారిని సహాయం అడిగింది. ఎవ్వరూ బాలిక గోడును పట్టించుకోలేదు. అటుగా వెడుతున్న ఓ హిజ్రా బాలిక ఏడుస్తూ, గాయాలతో ఉండడాన్ని గమనించి.. ఏం జరిగిందని అడిగింది. మా వాళ్లకు ఫోన్ చేయమంటూ అడిగింది. ఆమె చెప్పిన నెంబర్ కు కాల్ చేసి.. మాట్లాడించింది.

హిజ్రా ఏం చెబుతోందంటే...‘బాలిక ఏడుస్తూ ఉండడం చూసి.. ఏమైంది.. ఇక్కడెందుకున్నావ్ అని అడిగాను. తనను ఎవరో ఎత్తుకొచ్చారని చెప్పింది. వాళ్లనుంచి తప్పించుకుని వచ్చానని.. చాలామందిని ఫోన్ చేయమని అడిగినా చేయలేదని చెప్పింది. నేను ఆమె చెప్పిన నెంబర్ కు ఫోన్ చేశాను. ఆ చిన్నారిని అడ్రస్ అడిగి.. చెబుతుంటే మత్తుమందు స్ప్రే చేసి.. బండిమీద ఇక్కడికి తీసుకువచ్చారని చెప్పింది.. వెంటనే నేను పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాను.’ అని చెప్పుకొచ్చింది. 

అక్కడికి చేరుకున్న పోలీసులు, బంధువులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధిత బాలిక చెప్పిన వివరాల ప్రకారం నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu