నాకూ , సంజయ్‌కి విభేదాలు లేవు.. కిషన్ రెడ్డిది గోల్డెన్ హ్యాండ్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుపై అర్వింద్

By Siva KodatiFirst Published Jul 4, 2023, 8:34 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామకంపై స్పందించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పార్టీలో తనకు , బండి సంజయ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చిరు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామకంపై స్పందించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి బీజేపీకి లక్కీ హ్యాండ్ అన్నారు. ఆయనొక పరిణితి చెందిన రాజకీయ వేత్త అని, కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2024లో ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొడతారని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించినందుకు కూడా అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈటల తెలంగాణవ్యాప్తంగా అగ్రెసివ్‌గా వెళ్తారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ ఎంతో కష్టపడ్డారని అర్వొంద్ ప్రశంసించారు. 

తామంతా కలిసి బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేపేందుకు కొన్ని ఛానెళ్లు కష్టపడుతున్నాయని.. ఫేక్ న్యూస్‌తో ప్రజలను మభ్యపెట్టలేరని ఆయన దుయ్యబట్టారు. రాహుల్‌కు రాజకీయం నేర్పేందుకు కొన్ని మీడియా సంస్థలు క్లాసులు ఇస్తున్నాయని అర్వింద్ సెటైర్లు వేశారు. పార్టీలో తనకు , బండి సంజయ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చిరు. 

Latest Videos

ALso Read: బీజేపీ అధ్యక్షుడి మార్పుపై రఘునందన్ రావు కామెంట్లు.. బండి సంజయ్ పైనా వ్యాఖ్య

మరోవైపు.. తనకూ పదవులు కావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొన్ని రోజులుగా గళం విప్పుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సహా మరో పదవిలో ఏదైనా తనకు ఇవ్వాలని ఆయన చెప్పారు. తనకు సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపైనా ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో తాను ఇవేమీ మాట్లాడలేదని యూటర్న్ తీసుకున్నారు.

కానీ, ఆ పాటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేసిన మరుసటి రోజే రాష్ట్ర అధ్యక్షుడిగా జీ కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించిది. ఈటల రాజేందర్‌ను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించారు. రఘునందన్ రావుకు ఏ పదవీ దక్కలేదు. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు తాజాగా బీజేపీ చేపట్టిన సంస్థాగత మార్పులపై స్పందించారు.

కాగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, బండి సంజయ్ పైనా వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సారథ్యంలో పార్టీ బాగా పని చేసిందని కితాబిచ్చారు.

click me!