రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో స్వల్ప భూకంపం: భయంతో జనం పరుగులు

By narsimha lodeFirst Published May 23, 2022, 9:00 PM IST
Highlights


రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్లలో సోమవారం నాడు రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 


చేవేళ్ల: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని chevellaలో సోమవారం నాడు రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.Telangana రాష్ట్రంలోని పలు జిల్లాలో 2021 అక్టోబర్ 31న #Earth quake వాటిల్లింది. జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో  పాటు పలు ప్రాంతాల్లో  స్వల్పంగా  భూకంపం సంబవించింది. .దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

తెలంగాణ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో  భూకంపం సంబవించింది.  భూమి లోపల 77 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోపియన్ మెడిటరేయన్ సిస్మోలాజికల్ సెంటర్ నివేదిక ప్రకారంగా భూకంప తీవ్రత 4.3 గా నమోదైంది.

జగిత్యాల, రామగుండం, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో  భూకంపం సంబవించింది.జగిత్యాల,, మంచిర్యాల  జిల్లాలోని  బెజ్జూరు, సలుగుపల్లి, సులుగుపల్లి గ్రామాల్లో స్వల్ప భూకంపం సంబవించింది. వారం రోజుల వ్యవధిలో మంచిర్యాల  జిల్లాలో రెండు దఫాలు భూకంపం  సంబవించడం కలకలం రేపుతుంది. 2021 అక్టోబర్ 24వ తేదీన  పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో భూకంపం వాటిల్లింది.

మంచిర్యాల జిల్లాలోని కొన్ని కాలనీల్లో కూడ భూమి స్వల్పంగా కంపించింది. సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల్లో కూడా రాళ్లు విరిగిపడ్డాయి. భూకంపం వాటిల్లిన వెంటనే బొగ్గుగని కార్మికులను వెంటనే ఖాళీ చేయించారు. శ్రీరాంపూర్, నస్పూర్, సీతారాంపాల్, శ్రీశ్రీనగర్, అమ్మగార్డెన్ కాలనీల్లో భూకంపం సంబవించింది.

పెద్దపల్లి జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడం తో జనం పరుగులు తీశారు. మూడు సెకన్ల పాటు భూమి కంపిచడంతో పలు ప్రాంతాల్లో జనం బయటకు పరుగులు తీసి కలవరపడ్డారు. పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట, ముత్తారం మండలం లోని  హరిపురం, కేశనపల్లి, దర్యాపూర్ గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ అశోక్ నగర్ గాంధీ నగర్ తో పాటు పలు ప్రాంతాలు స్వల్పంగా భూమి కంపించింది. పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని వెన్నంపల్లి గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

మరోవైపు బెల్లంపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో భూమి కంపించింది. లక్సెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం, ముత్తారం మండలాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వాటిల్లింది.ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడ భూకంపం వాటిల్లిందని సమాచారం. 

also read:జపాన్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాల్లో ఇటవల కాలంలో స్వల్ప భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి. 2021 ఆగష్టు 24న ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల భూకంపం వచ్చింది. బంగాశాఖాతంలో భూకంపం  కారణంగా ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల భూమి కంపించింది. 

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూమిలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు 296 కి.మీ దూరంలో ఆగ్నేయంగా, తమిళనాడులోని చెన్నైకి 320 కి.మీ దూరంలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని తీరాల్లో భూమి లోపల 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు.ఈ భూకంపం గురించి పలువురు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు.
 

 
 

click me!