లైఫ్ సైన్సెస్ కేపిటల్ గా హైద్రాబాద్: థావోస్ లో కేటీఆర్

By narsimha lodeFirst Published May 23, 2022, 7:53 PM IST
Highlights

లైఫ్ సైన్సెస్ కేపిటల్ గా హైద్రాబాద్ అభివృద్ది చెందిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. థావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

థావోస్: Lifesciences  మెడికల్ రంగానికి  Hyderabad తన బలాన్ని మరింత పెంచుకుంటుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR  చెప్పారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం  WEF సమావేశంలో తెలంగాాణ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రసంగించారు.  కరోనా సంక్షోభం సమయంలో లైఫ్ సైన్సెస్  Medical  రంగానికి మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు.ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడాలంటే భారత లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమన్నారు.

 

LIVE: Minister speaking at a panel discussion on 'Telangana Lifesciences Industry's Vision For 2030' in Davos https://t.co/QUUJOJWYn2

— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR)

Telangana  ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలో జరిగిన అభివృద్ది, తీసుకు వచ్చిన సంస్కరణలపై కేటీఆర్ వివరించారు. లైఫ్ సైన్సెస్ కేపిటల్ గా Hyderabad అభివృద్ది చెందిందన్నారు. దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోని అతి పెద్ద Pharma సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం నుండి సరైన  మద్దతు లభించడం లేదని ఆయన చెప్పారు.

click me!