డెక్కన్ మాల్‌‌ను పరిశీలించిన తలసాని.. జనావాసాల మధ్యలో గోడౌన్స్ ఉండనివ్వమన్న మంత్రి

By Siva KodatiFirst Published Feb 8, 2023, 5:30 PM IST
Highlights

జనావాసాల మధ్య వున్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మంత్రి తెలిపారు. 
 

సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలోని డెక్కన్ మాల్ భవనం కూల్చివేసిన స్థలాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దెబ్బతిన్న ఇళ్లకు నెల రోజుల్లో మరమ్మతులు చేయిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలోని నివాస ప్రాంతాల్లోని గోదాములు గుర్తించి తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

జనావాసాల మధ్య వున్న గోదాములను తరలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని.. డెక్కన్ మాల్ పరిసరాల్లోని ఇళ్లకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవనం కూల్చివేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మంత్రి తెలిపారు. 

Also REad: తప్పిన ప్రమాదం: కూలిన డెక్కన్ మాల్ ఆరు అంతస్తులు

ఇకపోతే.. గత నెల 26వ తేదీ నుండి  డెక్కన్ మాల్ కూల్చివేత పనులను  టెండర్ దక్కించుకున్న సంస్థ  ప్రారంభించింది. చుట్టు పక్కల  భవనాలు దెబ్బతినకుండా  డెక్కన్ మాల్ ను కూల్చివేసే పనులను ప్రారంభించారు. ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో  ముగ్గురి ఆచూకీ  లభ్యం కాలేదు. అయితే అధికారులు తనిఖీలు చేసిన సమయంలో  ఓ ఆస్తిపంజరం లభ్యమైంది. దీంతో ఈ ఆస్థి పంజరం ఎవరిదనే విషయమై  అధికారులు  ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలను పంపారు. 

click me!