జన్ కీ బాత్ వదిలి మన్ కీ బాత్ వింటున్నారు: ఈటలపై హరీష్ రావు సెటైర్లు

By narsimha lode  |  First Published Feb 8, 2023, 4:55 PM IST

బీజేపీలో  చేరిన తర్వాత  ఈటల రాజేందర్  జన్ కీ బాత్ ను పట్టించుకోవడం లేదని  తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  చెప్పారు.  


హైదరాబాద్:  బీజేపీలోకి  వెళ్లిన తర్వాత  ఈటల రాజేందర్  జన్ కీ బాత్ పట్టించుకోవడం మానేశారని  తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  సెటైర్లు  వేశారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై విమక్షాల ప్రశ్నలకు  మంత్రి హరీష్ రావు  బుధవారం నాడు సమాధానమిచ్చారు.  బీఆర్ఎస్ లో  ఉన్న సమయంలో   ఈటల రాజేందర్  జన్ కీ బాత్  వినేవారన్నారు. బీజేపీలో చేరిన తర్వాత జన్ కీ బాత్  వదిలేసి  మన్ కీ బాత్ వింటున్నారని   మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

also read:ఫాంహౌస్ లో గోవు పూజ: తాంత్రిక పాలన అంటూ బీజేపీ విమర్శలకు హరీష్ కౌంటర్

Latest Videos

 కాషాయ పార్టీలో  చేరిన  తర్వాత  ఏ కషాయం  తాగారో  కానీ  ప్రజల  సమస్యలన పట్టడం లేదని  ఈటల రాజేందర్  పై ఆయన విమర్శలు  చేశారు.  తెలంగాణరాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రిగా  ఉన్న సమయంలో  కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులుఇప్పించేలా  ఒత్దిడి తేవాలని  రాజేందర్  కోరిన విషయాన్ని మంత్రి  హరీష్ రావు  గుర్తు  చేశారు. ఇదే అసెంబ్లీ వేదికగా   బీజేపీ శాసనససభపక్ష నేతగా  ఉన్న లక్ష్మణ్  ను కోరలేదా  అని ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు.  

తెలంగాణ రాష్ట్రానికి  కేంద్రం నుండి రావాల్సిన  నిధులను ఇప్పించేలా  బీజేపీ  నాయకత్వంపై  ఒత్తిడి తీసుకురావాలని  మంత్రి హరీష్ రావు  ఈటల రాజేందర్ ను కోరారు. నిండు పున్నమిలో  వెన్నెల వెలుగులు చూడకుండా  చందమామలో  మచ్చలు చూస్తూన్నారని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  తీరును  మంత్రి హరీష్ రావు   విమర్శలు  చేశారు. 

సీటు మారినంత  మాత్రాన  మనసు మారొద్దని  మంత్రి హరీష్ రావు  కోరారు..  సీటు మారినంత మాత్రాన వ్యక్తిత్వాలు మారోద్దని ఆయన  ఈటల రాజేందర్  కు సూచించారు. ఈటల రాజేందర్  తనకు మిత్రుడేనన్నారు.  తమ మధ్య సిద్దాంత వైరుధ్యమే ఉందని  చెప్పారు.  రాజకీయంగా వైరుధ్యాలున్నాయన్నారు.

ఈ వ్యాఖ్యలు  చేసిన సమయంలో ఈటల రాజేందర్ నవ్వుతున్నాడని  ట్రెజరీ బెంచ్ సభ్యుడొకరు హరీష్ రావు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో హరీష్ రావు కూడా నవ్వుతూ మాట్లాడారు.   రాజేందరన్నా  బయటకు వెళ్లి ప్రిపేర్ అయి వచ్చావా అని  ప్రశ్నించారు. దళిత బంధు  కింద  ఇంకా ఎవరికి  రాలేదో  జిల్లా కలెక్టర్  కు జాబితా ఇవ్వాలని మంత్రి హరీష్ రావు  ఈటల రాజేందర్ కు సూచించారు. 

click me!