RTC Strike:కేసీఆర్‌తో పువ్వాడ, సునీల్ శర్మ భేటీ, హైకోర్టు ఆదేశాలపై చర్చ

By narsimha lode  |  First Published Oct 20, 2019, 3:23 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో ఏం చేయాలనే దానిపై తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శాఖ భేటీ అయ్యారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో మంత్రి పువ్వడ అజయ్ కుమార్, సునీల్ శర్మ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాల కాపీ అందింది. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఈ నెల 18వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏం చేయాలనే విషయమై సీఎం కేసీఆర్‌ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ఆదివారం నాడు మధ్యాహ్నం భేటీ అయ్యారు.

Latest Videos

ఈ నెల 5 వతేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు మరో 26 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.

RTC Strike:నల్గొండలో ఏడీసీ మల్లయ్య మృతి

ఆర్టీసీ కార్మికులు రోజు రోజుకూ తమ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన  రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలపగా రాష్ట్ర బంద్ ను కూడ ఆర్టీసీ  కార్మికులు విజయవంతంగా నిర్వహించారు.ఈ నెల 18వ తేదీన ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సందర్భంగా  తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఎసీ హైకోర్టుకు తేల్చి చెప్పింది.

హాట్ టాపిక్ ఆర్టీసీ సమ్మె: మెట్టు దిగని కేసీఆర్, పట్టువీడని కార్మికులు

ఈ నెల 19 వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఆర్టీసీ  కార్మికులతో చర్చలు జరపాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు కాపీ అందలేదనే కారణంగా ప్రభుత్వం నుండి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేదు.

ఆదివారం నాడు హైకోర్టు కాపీ అందింది ఈ కాపీని తీసుకొని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రవాణ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ఆదివారం నాడు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయమై ఏం చేయాలనే  విషయమై సీఎం చర్చిస్తున్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 28వ తేదీన ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టుకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పనుందనే విషయమై కూడ ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో  సీఎం కేసీఆర్ వైఖరిలో ఏమైనా మార్చుకొంటారా... లేదా అనేది ఈ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

హైకోర్టు ఆదేశాల ప్రకారంగా అయితే ఈ నెల 19వ తేదీన ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరగాలి. వాస్తవానికి అదే సమయానికి చర్చలు  ప్రారంభమైతే  చర్చలు ప్రారంభమై ఒక్క రోజు అయ్యేది. అయితే హైకోర్టు ఆర్డర్ కాపీ అందని కారణంగా చర్చలు ప్రారంభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

 

 

click me!