Huzurnagar Bypoll:ఉత్తమ్‌కు ఎస్పీ షాక్: ట్విస్టిచ్చిన ఈసీ

By narsimha lodeFirst Published Oct 20, 2019, 1:24 PM IST
Highlights

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానాకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎన్నికల సంఘం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్ లో ఉండేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ విషయమై  ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖకు ఈసీ అనుమతిని ఇచ్చింది.


హైదరాబాద్: హుజూర్‌నగర్ నుండి వెళ్లిపోవాలని సూర్యాపేట ఎస్పీ పోన్ చేయడంపై  పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ తీరుపై  పీసీసీ చీఫ్  మండిపడ్డారు.

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21వ తేదీన  ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానానికి  కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు.

 ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం పూర్తైనందున స్థానికేతరులంతా హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వెళ్లిపోవాలని  ఈసీ ఆదేశించింది.

ఈసీ ఆదేశాల మేరకు సూర్యాపేట ఎస్పీ ఆదివారం నాడు ఉదయం  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి హుజూర్‌నగర్ నుండి వదిలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే  ఈ విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసీకి లేఖ రాశాడు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఆన్ స్క్రీన్ బంద్... ఆఫ్ స్క్రీన్ సీన్ షురూ!

తాను నల్గొండ ఎంపీని, స్థానికుడిని తాను హుజూర్‌నగర్ లో ఉండే అవకాశం కల్పించాలని కోరారు. ఈ లేఖకు ఈసీ సానుకూలంగా స్పందించింది.హుజూర్‌నగర్‌లోనే ఉండేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈసీ అనుమతిని ఇచ్చింది.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కారుకు ఈసీ దెబ్బలు, సైదిరెడ్డి మిత్రుడి బడిలో సోదాలు

ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నందున హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతున్నందున స్థానికేతురుడయ్యే అవకాశం ఉందని భావించిన ఎస్పీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని హుజూర్‌నగర్ విడిచి పెట్టాలని కోరాడు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: రేపటితో మైక్ లు గప్ చుప్, తెర వెనకనే అంతా...

అంతేకాదు స్థానిక పోలీసులు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న నివాసం వద్దకు వచ్చి హుజూర్‌నగర్ ను వదిలి వెళ్లాలని కోరారు. అయితే స్థానిక పోలీసులతో పాటు ఎస్పీ వ్యవహారశైలిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం తనకు హుజూర్ నగర్ లో ఉండేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.ఈ  మేరకు ఈసీ ఇచ్చిన లేఖను కూడ ఆయన పోలీసులకు చూపారు.

తాను హుజూర్‌నగర్ ‌లో  లేకుండా ఉండేందుకుగాను ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల విధుల్లోనిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాడని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును ఈసీ బదిలీ చేసింది.

వెంకటేశ్వర్లు స్థానంలో భూపాలపల్లి జిల్లా ఎస్పీగా ఉన్న భాస్కరన్ ను ఈసీ సూర్యాపేట జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. సూర్యాపేట ఎస్పీగా భాస్కరన్ నియామకం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని టీఆర్ఎస్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

click me!