రంగారావుకు జేఏసీ నేతల పరామర్శ

By Rekulapally SaichandFirst Published Oct 20, 2019, 2:11 PM IST
Highlights

శనివారం తెలంగాణ బంద్‌లో తీవ్రంగా గాయపడ్డ రంగరావును  పలువురు నేతలు  హాస్పెటల్  వెళ్ళి  పరామర్శిస్తున్నారు. ఆర్టీసీ జేఎసీ ఆశ్వ అశ్వత్ధామ రెడ్డి సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ,ఇతర ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నాయకులు రంగారావును పరమర్శించారు. డాక్టర్లను ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

శనివారం  జరిగిన  తెలంగాణ బంద్ సందర్భంగా పలు  చోట్ల ఉద్రికత్తల చోటు చేసుకోగా మరికొన్ని చోట్ల ప్రశాంతగా కొనసాగింది. అయితే హైదరాబాద్... ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నిరసన చేస్తున్న సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటన వేలు తెగి పోయింది. చేతి వెలు తెగడంతో ఆయన తీవ్ర రక్త స్రావం జరిగింది. దీంతో అతన్ని హుటహుటిన  ఆస్పత్రికి తరిలించి చికిత్స అందించారు. 

ఆందోళన చేస్తున్న ఆయనను  పోలీసులు వ్యాన్‌లో ఎక్కించే క్రమంలో  తలుపులు మూసే క్రమంలో  వాటి  మధ్యన ఆయన బొటన వేలు ఇరుక్కుంది. అది చూడకుండా పోలీసులు డోరును బలంగా మూయడంతో రంగారావు చేతి బొటన వేలు తెగి పోయింది.

RTC strike: సీఎస్ కు ఆర్టీసీ ఎండీ కి జాతీయ బీసీ కమీషన్ నోటీసులు


ప్రస్తుతం రంగరావు ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. పలువురు నేతలు  హాస్పెటల్  వెళ్ళి ఆయనకు పరామర్శిస్తున్నారు. ఆర్టీసీ జేఎసీ ఆశ్వ అశ్వత్ధామ రెడ్డి సీపీఐ
నేత చాడ వెంకట్ రెడ్డి ,ఇతర ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నాయకులు రంగారావును పరమర్శించారు. డాక్టర్లను ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
నిరసన తెలిపితే అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వ విధానానికి నిదర్శనమని నేతలు విమర్శించారు. 

కావాలనే పోలీసులు ఇలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన బోటన వేలు తెగిపోవడంపై  రంగరావు కూడా తీవ్రంగా స్పందించారు. "సీఎం కేసీఆర్ ఉద్యమంలో పాట్గొనేవారిని చంపమన్నారా? తెలంగాణ ఉద్యమంలో చేసినందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమనమా" అంటూ పోలీసులను రంగారావు ప్రశ్నించారు. 

Telangana Bandh Photos: బోసిబోయిన డిపోలు, రోడ్లు, నిరసనలు
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బంద్‌లో కొన్నిఉద్రిక్త ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగానే ముగిసింది. 16 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె  బంద్‌తో మరింత తీవ్రమవుతుంది.

కేసీఆర్  ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు మరోవైపు  పట్టు విడాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టడంతో.. ఆర్టీసీ కార్మికులు సీఎం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను  నెరవేర్చకుండా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని మండిపడుతున్నారు.  ప్రభుత్వం వెనక్కు తగ్గి చర్చలకు రాకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

click me!