మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరే...: కేటీఆర్ ముందే పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Aug 17, 2023, 05:09 PM IST
మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరే...: కేటీఆర్ ముందే పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ ప్రజల ఆశిస్సులతో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. 

హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ వల్ల పెద్దవాళ్లుగా పేరుతెచ్చుకున్న కొందరు ఇప్పుడు అదే పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ సీరియస్ అయ్యారు.ఇలాంటివారు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారికి ఉద్యమనాయకుడు కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదు... ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిదని పొంగులేటిని హెచ్చరించారు పువ్వాడ. 

ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం నాయకుడు తెల్లం వెంకట్రావు ఇవాళ మళ్లీ సొంతగూటికి చేరాడు. మంత్రి కేటీఆర్ వెంకట్రావుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకే చెందిన మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించారని అన్నారు. కాబట్టే రెండోసారి ప్రజలు ఆయనకే అవకాశం ఇచ్చారన్నారు. ఈసారి కూడా సుపరిపాలన అందించిన కేసీఆరే వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయి హ్యాట్రిక్ సాధించబోతున్నారని మంత్రి పువ్వాడ జోస్యం చెప్పారు. 

Read More  బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం వెంకటరావు: కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు

యావత్ తెలంగాణతో పాటే ఖమ్మం జిల్లాలోనూ కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఖమ్మం జిల్లా బిడ్డగా తన జీవితంలో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ తొమ్మిదేళ్లలో చూసానని అన్నారు. కాబట్టి పని చేసిన ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపై ఉందని మంత్రి అన్నారు. 

ఖమ్మం జిల్లాలోని మారుమూల గూడెంలు, తండాలకు గతంలో రోడ్డు, విద్యుత్ సౌకర్యం వుండేదికాదు... కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి ప్రాంతాలకు అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించి దాహం తీర్చారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనులకు లక్షన్నర ఎకరాల పట్టాలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పువ్వాడ కొనియాడారు. 

ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ అదిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ సైనికులుగా పనిచేసి గెలిపించుకుంటామని... ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రతి ఇంటికి గడపకు వెళతామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేలే ఉంటే అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది... ప్రజల ఆకాంక్షలు వేగంగా నెరవేరుతాయని రవాణ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!