షర్మిలకు నిరంజన్ రెడ్డి కౌంటర్.. ఆ పని చేసి సత్తా చూపించాలని సవాలు.. వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకోమని హెచ్చరిక

Published : Sep 10, 2022, 05:39 PM IST
షర్మిలకు నిరంజన్ రెడ్డి కౌంటర్..  ఆ పని చేసి సత్తా చూపించాలని  సవాలు.. వ్యక్తిగతంగా దూషిస్తే ఊరుకోమని హెచ్చరిక

సారాంశం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని మండిపడ్డారు. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం షర్మిల మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని మండిపడ్డారు. ఒక్కమాటకు వందమాటలు అంటామని.. ఆత్మ‌విశ్వాసంతో చీల్చి చెండాడుతామ‌ని అన్నారు. ‘‘రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటి చేసి నీ సత్తా ఏంటో చూపించాలి’’ అని షర్మిలకు నిరంజన్ రెడ్డి సవాలు విసిరారు. 

తాను 22 ఏళ్లు తెలంగాణ జెండా పట్టుకుని.. ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన బిడ్డలను విదేశాల్లో చదివించానని తెలిపారు. తాము వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. ‘‘రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది’’ అంటూ షర్మిలపై నిరంజన్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని తాను అని చెప్పారు. 

Also Read: ఎవడ్రా నీకు మరదలు.. కుక్కకు నీకు తేడా వుందా : మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల ఆగ్రహం

ఇక, వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. శుక్రవారం మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలో ప్రవేశించింది. ఈ సందర్భంగా గతంలో నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాను గతంలో నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తుంటే.. నిరంజన్ రెడ్డి తనను గతంలో మంగళవారం మరదలు అన్నారని గుర్తుచేసుకున్న షర్మిల.. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అని అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

ప‌రాయి స్త్రీలో త‌ల్లిని, చెల్లిని చూడ‌లేని సంస్కార హీనుడు నిరంజ‌న్ రెడ్డి అని అన్నారు. . ఆయనకు కుక్కకు ఏమైనా తేడా ఉందా అని మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  అధికార మదం తలకెక్కిందా... నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్