లిఖితపూర్వంగా హామీ ఇస్తేనే.. ఢిల్లీ నుంచి కదిలేది: తేల్చిచెప్పిన నిరంజన్ రెడ్డి

Siva Kodati |  
Published : Dec 21, 2021, 07:02 PM IST
లిఖితపూర్వంగా హామీ ఇస్తేనే.. ఢిల్లీ నుంచి కదిలేది: తేల్చిచెప్పిన నిరంజన్ రెడ్డి

సారాంశం

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరామన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రెండ్రోజుల తర్వాత కేంద్ర మంత్రిని మరోసారి కలుస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా వుందని ఆయన అన్నారు. 

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరామన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy) . మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజులు సమయం కావాలని కేంద్ర మంత్రి అన్నారని తెలిపారు. రెండ్రోజుల తర్వాత కేంద్ర మంత్రిని మరోసారి కలుస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా వుందని ఆయన అన్నారు. కిషన్ రెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏ సహాయం చేయకుండా బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  

బియ్యాన్ని ఎఫ్‌సీఐ తరలించడం లేదనే విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లామని... దీనికి స్పందించిన ఆయన రైల్వే మంత్రికి ఫోన్‌ చేసి ర్యాక్‌లు సమకూర్చాలని కోరారని నిరంజన్ రెడ్డి తెలిపారు. నెలకు 40లక్షల టన్నుల బియ్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం రాష్ట్రంలో ఉందని... ధాన్యం సేకరణపై బీజేపీ నేతలు చెబుతున్న అంశాలను పీయూష్‌ గోయల్‌కు వివరించామని మంత్రి వెల్లడించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మరోసారి స్పష్టం చేశారని నిరంజన్ రెడ్డి చెప్పారు. 

ALso Read:మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం, వారికేం పనిలేదా: తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫైర్

వానాకాలం లక్ష్యం 60 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 2, 3 రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు. మార్కెట్‌ యార్డుల వద్ద మరో 10,  12 లక్షల  టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందన్నారు. మరో 5 లక్షల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉందని పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలా? మూసివేయాలా? చెప్పాలని కోరామని... ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ కోరామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఏ విషయం స్పష్టంగా చెప్పిన తర్వాతే ఢిల్లీ నుంచి కదులుతాం అని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.  

కాగా.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రి Piyush Goyal తో  తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు,ఎంపీల బృందం మంగళవారం నాడు న్యూఢిల్లీలో భేటీ అయింది. వానాకాలంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి నుండి లిఖితపూర్వక హామీని  ఇవ్వాలని తెలంగాణ మంత్రులు పట్టుబుడుతున్నారు. వానాకాలం Paddy ధాన్యం కొనుగోలు విషయమై  రెండు రోజులుగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం ఢిల్లీలోనే మకాం వేసింది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర  గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రితో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్