బిర్యానీకి వెళ్లిన వ్యక్తి హత్య: 9 మంది ‘‘మొఘల్స్ ప్యారడైజ్’’ సిబ్బంది అరెస్ట్ .. ఐరన్ రాడ్లు, కర్రలతో 3 గంటలు

Siva Kodati |  
Published : Dec 21, 2021, 05:23 PM ISTUpdated : Dec 21, 2021, 05:26 PM IST
బిర్యానీకి వెళ్లిన వ్యక్తి హత్య: 9 మంది ‘‘మొఘల్స్ ప్యారడైజ్’’ సిబ్బంది అరెస్ట్ .. ఐరన్ రాడ్లు, కర్రలతో 3 గంటలు

సారాంశం

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ కేపీహెచ్‌బీలో బిర్యానీ కోసం వెళ్లిన వ్యక్తిని దొంగగా భావించి కొట్టి చంపిన కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. రాజేశ్‌ను దాదాపు 3 గంటల పాటు కర్రలు, ఐరన్ రాడ్లతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు నిందితులు. అరవింద్ అండ్ బ్యాచ్ దెబ్బలు తాళలేక మరుసటి రోజు రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు. 

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ కేపీహెచ్‌బీలో బిర్యానీ కోసం వెళ్లిన వ్యక్తిని దొంగగా భావించి కొట్టి చంపిన కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన జరిగిన రోజున మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ మేనేజర్ అరవింద్ పుట్టినరోజు  కావడంతో సెల్లార్‌లో మద్యం సేవించారు రెస్టారెంట్ సిబ్బంది. అదే సమయంలో సెల్లార్ వద్దకు వచ్చిన బాధితుడిని మద్యం మత్తులో వున్న హోటల్ సిబ్బంది చితకబాదారు. 

రాజేశ్‌ను దాదాపు 3 గంటల పాటు కర్రలు, ఐరన్ రాడ్లతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు నిందితులు. అరవింద్ అండ్ బ్యాచ్ దెబ్బలు తాళలేక మరుసటి రోజు రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అనంతరం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. 3 సెల్‌ఫోన్లు, ఒక స్కూటీ, కర్రలు, ఐరన్ రాడ్లు, వాటర్ పైపులు స్వాధీనం చేసుకున్నారు. 

Also Ride: మొఘల్ ప్యారడైజ్ సిబ్బంది కిరాతకం.. బిర్యానీ కోసం వెళితే దొంగ అనుకుని కొట్టి చంపేశారు

వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన రాజేష్‌ (rajesh) అనే కార్మికుడు భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్‌లో ఉంటూ ప్రగతినగర్‌లో భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. గత బుధవారం అర్ధరాత్రి సమయంలో పని ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో జేఎన్‌టీయూహెచ్‌ (jntuh) మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న మొఘల్స్‌ ప్యారడైజ్‌ (mughals paradise) రెస్టారెంట్‌ దగ్గరకు వెళ్లాడు. రెస్టారెంట్ సెల్లార్లోకి వెళ్లి మిగిలిపోయిన బిర్యానీ ఏరుకుంటున్నాడు. అతడిని గమనించిన సిబ్బంది దొంగగా భావించి దాడి చేశారు.

ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో రాజేశ్ అక్కడే పడిపోయాడు.. కిందపడిన వ్యక్తిని మానవత్వం లేకుండా అక్కడే వదిలేసి వెళ్లారు సిబ్బంది. గురువారం ఉదయం వచ్చి చూసేసరికి అతడు అక్కడే పడి వున్నాడు. దీంతో రాజేష్ తండ్రికి సమాచారం ఇచ్చారు రెస్టారెంట్ సిబ్బంది. అతడు రాజేష్ భార్యకు విషయం చెప్పడంతో ఆమె వచ్చి భర్తను ఇంటికి తీసుకెళ్లింది. అయితే ఆ కాసేపటికే అతడు మృతి చెందడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్