ఏపీలో కుల రాజకీయాలు తప్ప ఏమి లేదు.. మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Jun 4, 2023, 8:28 PM IST
Highlights

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలకు ఉన్న శ్రద్ద రాష్ట్ర అభివృద్దిపై లేదని అన్నారు. 

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలకు ఉన్న శ్రద్ద రాష్ట్ర అభివృద్దిపై లేదని అన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్‌ పార్టీనేనని జోస్యం చెప్పారు. ఏపీ ప్రజలు కూడా కేసీఆర్ లాంటి పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న  మల్లారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ హవా కొనసాగుతోందని అన్నారు. మధ్యప్రదేశ్ కూడా తమదేనని, యూపీ కూడా కదులుతోందని అన్నారు. 


రేపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఏపీ ప్రజలకు సరైన పాలన అందడంలేదని విమర్శలు చేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ఏ విధంగా అభివృద్ది చెందుతుంది.. ఆంధ్రప్రదేశ్ ఎంత డౌన్ అయిపోయిందనే ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏపీ గురించి చెప్పాల్సి వస్తే అక్కడ అంతా కుల రాజకీయాలనేనని విమర్శించారు. కాపు లీడర్, కమ్మ లీడర్, రెడ్డి లీడర్ అని అంటుంటారని.. వాళ్లెవరూ ప్రజలను పట్టించుకోవడంలేదు విమర్శించారు. ఏపీలో పోలవరం కట్టలేదని.. తమ సీఎం కేసీఆర్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని చెప్పారు. ఏపీలో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోలేకపోతున్నారని.. ఇక్కడ మాత్రం సింగరేణిని కాపాడుకుంటున్నామని తెలిపారు. 

రియల్ ఎస్టేట్ రంగంలో.. విద్యా రంగంలో.. ప్రతి దానిలో తెలంగాణ అభివృద్ధి చెందితే..  ఆంధ్రప్రదేశ్ మాత్రం డౌన్ అయిపోయిందని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం.. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ప్రజల అదృష్టమని.. వారికి రుణపడి ఉండాలని అన్నారు. 
 

click me!