తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి నోట దొరల పాలన మాట

First Published Sep 10, 2017, 6:28 PM IST
Highlights
  • తెల్ల దొరల పాలన కంటే నల్లదొరల పాలనలోనే అన్యాయం
  • తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు స్వర్ణయుగం మొదలైంది

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నోట దొరల పాలన అనే మాట వచ్చింది. ఇదేదో రహస్య ప్రదేశంలో కాదు మహబూబ్ నగర్ జల్లాలో జరిగిన రైతు సమన్వయ సమితి ల శిక్షణా శిబిరంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి.

ఉమ్మడి రాష్ట్రం లో రైతులు దారుణంగా దగా పడ్డారు.  తెల్ల దొరల పాలనలో కంటే నల్ల దొరల పాలనలో అన్యాయం అయిపోయారు. రైతులు కూలీలుగా మారి ఉప్పరి పనుల్లో తట్టలు మోశారు.  తెలంగాణ ఆవిర్భావం తర్వాత రైతులకు స్వర్ణ యుగం మొదలైంది.  రైతే రాజు అన్న నానుడిని నిజం చేసే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారు.

రైతు సమన్వయ సమాఖ్యలను ఏర్పాటు చేస్తున్నారు. రైతు సమాఖ్యలకు చట్టబద్ధత కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ని అందిస్తున్నది ప్రభుత్వం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే ప్రణాళికలతో పని చేస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లా సశ్యశ్యామలం అవుతుంది.

కల్వకుర్తి ఎత్తిపోతల నీరు పొలాలకు అందుతున్నది. ఈ సందర్బంగా ఎన్నికైన రైతు సమన్వయ సమాఖ్యల చేత మంత్రి ప్రతిజ్ఞ, ప్రమాణాలు చేయించారు.  ఈ కార్యక్రమాల్లో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, జడ్పీ చైర్మన్ భాస్కర్, స్థానిక ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!