సింగరేణి అధికారులకు కోపమొచ్చి ఇలా చేశారు

First Published Sep 10, 2017, 5:53 PM IST
Highlights
  • సింగరేణి అధికారులకు కోపమొచ్చింది
  • ఇల్లెందులో ఓపెన్ కాస్ట్ నిర్వాసితుల ఇండ్లు నేలమట్టం
  • అడ్డుకున్న తెలంగాణ జెఎసి
  • వెళ్లిపోయిన సింగరేణి అధికారులు, పోలీసులు

ఆ సింగరేణి అధికారులు పేదల పట్ల కోపంగా ఉన్నట్లుంది. అందుకే ఆదివారం పూట సెలవు దినమైనా వారు డ్యూటీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పేదల ఇండ్లను జెసిబిలతో కూల్చి పారేశారు. మామూలు రోజుల్లో కాకుండా ఆదివారం వచ్చి పేదల కొంపలను కూల్చడం పట్ల జనాలు మండిపడుతున్నారు. బాధితులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులోని  jk5 ఓపెన్ కాస్ట్ భూనిర్వాసితులని సర్కారు అధికారులు భయభ్రాంతులకు గురిచేశారు. అర్దాంతరంగా ఆదివారం ఐనప్పటికీ దౌర్జన్యంగా JCB ళ తొ పోలీస్ బెటాలియన్, MRO ను తీసుకోని వచ్చి ఇండ్లని కూల్చే పని మొదలు పెట్టారు. కూల్చివేత మొదలు పెట్టిన సింగరేణి యాజమాన్యం అప్పటికే 4 ఇండ్లని కూల్చివేశారు.

వెంటనె తెలంగాణ జెఎసి నేతలు జోక్యం తో వెనక్కి వెళ్లిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం ఏర్పడితే ఓపెన్ కాస్ట్ గనులే ఉండవని ఆశలు రేపిన వారు నేడు కాంట్రాక్టు వ్యవస్థని బలపర్చడానికి వందల కుటుంబాలను రోడ్డు మీద పడేయడం ఎంతవరకు న్యాయం బాధితులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలగొట్టిన నాలుగు ఇండ్లను తిరిగి నిర్మించి ఇవ్వాలని, నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!