తెలంగాణ రైతుల సేవలో హెలిక్యాప్టర్

First Published Sep 10, 2017, 9:02 AM IST
Highlights
  • రైతు సమన్వయ సమితి సమావేశాలకు హెలిక్యాప్టర్ లో పోచారం
  • రోజుకు ఐదు జిల్లాల్లో చక్కర్లు కొట్టనున్న పోచారం

తెలంగాణ రైతాంగానికి సేవలందించే విషయంలో టిఆర్ఎస్ సర్కారు హెలిక్యాప్టర్ ను వినియోగించనుంది. రైతాంగానికి రైతు సమన్వయ సమితి ల మీద అవగాహన కల్పించేందుకు హెలిక్యాప్టర్ లో వెళ్లి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం చేయనున్నారు.

నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా "రైతు సమన్వయ సమితులకు అవగాహన సదస్సులు" జరగనున్నాయి. ప్రతి రోజు అయిదు జిల్లాలో హెలికాప్టర్ ద్వారా పర్యటించి ఆ అవగాహన సదస్సులో మంత్రి పోచారం పాల్గొంటారు.

తొలిరోజు ఆదివారం కామారెడ్ఢి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ లో పోచారం పర్యటించి అవగాహన సదస్సులో పాల్గొంటారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రే కాకుండా మంత్రులు కూడా హెలిక్యాప్టర్లను వాడడం తెలంగాణ ప్రభుత్వంలోనే ఎక్కువగా జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు పెద్దగా హెలిక్యాప్టర్ లు వాడిన దాఖలాలు లేవు.

తెలంగాణ రాష్ట్రంలో సిఎం మాత్రమే కాకుండా మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, నాయిని నర్సింహ్మారెడ్డి హెలిక్యాప్టర్ ను ఇప్పటి వరకు వినియోగించారు. తాజాగా పోచారం సైతం హెలిక్యాప్టర్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు చేపడుతున్నారు.

 

click me!