Hyderabad: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై వివక్షను చూపుతూనే ఉందని మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. ఇచ్చిన ఒక్కహామీ కూడా అమలు చేయని మోడీ సర్కారు.. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే ఐదు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు అప్పగించిందనీ, దేశాన్ని దగా చేస్తున్న బీజేపీ, మోడీ భ్రమలో నుంచి ప్రజలు బయటకు రావాలని కేటీఆర్ అన్నారు.
Telangana Minister KTR: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారు, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై వివక్షను చూపుతూనే ఉందని అన్నారు. ఇచ్చిన ఒక్కహామీ కూడా అమలు చేయని మోడీ సర్కారు.. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే ఐదు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు అప్పగించిందనీ, దేశాన్ని దగా చేస్తున్న బీజేపీ, మోడీ భ్రమలో నుంచి ప్రజలు బయటకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, మోడీని టార్గెట్ చేశారు.
బీజేపీ సమాజాన్ని కులం, మతం పరంగా విభజించాలని చూస్తోందని విమర్శించారు. మతం పేరుతో మంట పెట్టి ఆ మంటలలో చలికాపుకోవాలని బీజేపీ.. ప్రజలు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఏపీకి అప్పగించిందని బీజేపీపై మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టంలో చెప్పిన హామీలను బీజేపీ సర్కారు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు, నల్లధనం బయటకు తీసుకువస్తాననీ, స్విస్ బ్యాంకులో దాచిన నల్లదానం తెచ్చి పేదలకు పంచుతానని చెప్పిన మోడీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పన గురించి చేసిన మాటలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
undefined
అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతు రుణాలు మాఫీ చేశామనీ, 73 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసిన ఘనత కేసీఆర్ దక్కిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పిన కేటీఆర్.. కొత్త ఉద్యోగాలు సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొడుతున్నాడని ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగాల గురించి కాకుండా ఉన్న ఉద్యోగాలు పోకుండా మోడీ ముందు ధర్నా చేయాలంటూ హితవు పలికారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు గురించి మోడీ నిలదీయాలని సూచించారు.
మానిన గాయన్ని మళ్లీ గెలికి తీయాలని బీజేపీ చూస్తోందని రజాకార్ సినిమా గురించి ప్రస్తావించారు. సినిమాలతో ప్రజలను రెచ్చగొడుతూ ఇలా చేతగాని వాళ్లు ప్రజల భావోద్వేగాలతో ఆగుకుంటున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పై కూడా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 50 ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఒక్కవకాశమంటూ ప్రజల వద్దకు వెళ్లడం విడ్దూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నెరవేర్చలేని హామీలతో ప్రజలు మోసం చేయడానికి సిద్ధమవుతున్నదనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, కాంగ్రెస్ కి ఓటు వేస్తే తెలంగాణ సంకనాకి పోవడం గ్యారెంటీ అని కేటీఆర్ విమర్శించారు.