కేసీఆర్‌ను ఓడించడానికి ఢిల్లీ దొరలు దిగుతున్నారు : కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ విమర్శలు

Siva Kodati |  
Published : Nov 05, 2023, 09:29 PM IST
కేసీఆర్‌ను ఓడించడానికి ఢిల్లీ దొరలు దిగుతున్నారు : కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ విమర్శలు

సారాంశం

సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి ఢిల్లీ దొరలు దిగి రావాల్సి వస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ను ఎదుర్కోలేక దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి ఢిల్లీ దొరలు దిగి రావాల్సి వస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం షాద్ నగర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగిస్తూ.. కేసీఆర్‌ను ఎదుర్కోలేక దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై ప్రేమలేని నాయకులు ఎన్నికలు కావడంతో ప్రచారానికి వస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు కానీ హామీలను ఇస్తున్నారని .. రాహుల్ గాంధీ ఏకంగా దొరల తెలంగాణ అని వ్యాఖ్యానించడం విడ్డూరంగా వుందన్నారు. 2014 నుంచి నేటి వరకు దొరల పాలన సాగిస్తోంది బీజేపీ కాదా అని కేటీఆర్ పేర్కొన్నారు . 

అంతకుముందు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఖమ్మంలో పువ్వాడ పువ్వులు కావాలా, తుమ్మల తుప్పలు కావాలా  తేల్చుకోవాలన్నారు. తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి... మీ ఇష్టమని  కేసీఆర్  చెప్పారు. పువ్వాడ అజయ్  చేతిలో ఓడిపోయి  తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో  కూర్చుంటే పిలిచిమంత్రి పదవి ఇచ్చినట్టుగా  సీఎం గుర్తు చేశారు. ఈ విషయం తాను  చెబితే  తనకే మంత్రి పదవి ఇప్పించినట్టుగా  తుమ్మల నాగేశ్వరరావు  విమర్శలు చేశారన్నారు. ఎవరికి ఎవరు మంత్రి పదవి ఇప్పించారో  మీ కళ్ల ముందే ఉంది కదా అని  కేసీఆర్  చెప్పారు.

Also Read: తుమ్మలను గెలిపిస్తే ముళ్లు గుచ్చుకుంటాయి: ఖమ్మం సభలో కేసీఆర్

తుమ్మల నాగేశ్వరరావుకు  మంత్రి పదవిని అప్పగిస్తే  ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ తప్ప ఒక్క  బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించలేదన్నారు. ఈ జిల్లాలో  ఇద్దరి పీడను వదిలించామని  తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి  కేసీఆర్ వ్యాఖ్యానించారు. వీరిద్దరూ పార్టీని వీడటంతో  జిల్లాలో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించనుందని  కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్ధులను అసెంబ్లీ గడప తొక్కనివ్వనని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  వ్యాఖ్యలపై  కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై  ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలని .. ఇది ఎంతవరకు  ధర్మమని ఆయన ప్రశ్నించారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్