బీజేపీ ‘హంగ్’ ఆశలు? ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?

By Mahesh K  |  First Published Nov 5, 2023, 7:06 PM IST

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ మంచోడని కామెంట్ చేశారు. అంతేకాదు, రాష్ట్రంలో హంగ్ వస్తుందని, ఆ హంగ్ ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వం వహిస్తుందనీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పడం గమనార్హం.
 


హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. బీజేపీ కూడా ప్రచారం చేస్తున్నది. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గానే ఉన్నది. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తున్నది. రెండు పార్టీలు మెజార్టీపై ధీమాగా ఉన్నాయి. అయితే, బీజేపీ కూడా తామే అధికారంలోకి వస్తామని ప్రకటనలు చేస్తున్నది. బీసీలను ఆకర్షించేలా హామీలు కురిపిస్తున్నది. ఒక వేళ బీజేపీ ఓట్లు చీల్చి ఇరుపార్టీలకు మెజార్టీ రాకపోతే మాత్రం హంగ్ ఏర్పడుతుంది. బీజేపీ నేతలు హంగ్ పై ఆశలు పెంచుకున్నారేమోననే అనుమానాలు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలతో వస్తున్నాయి. రాష్ట్రంలో కింగ్ మేకర్‌గా బీజేపీ ఉంటుందనే అంచనాలు ఆ పార్టీలో ఉన్నాయా? అనే సంశయాలు వస్తున్నాయి.

ధర్మపురి అర్వింద్ సీఎం కేసీఆర్ తనయ కవితను ఓడించి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పసుపు బోర్డు హామీతో ఎన్నికల్లో అనూహ్య  విజయం సాధించిన అర్వింద్ ఆ తర్వాతి నుంచి బీఆర్ఎస్ పై విమర్శల వాడి పెంచారు. ముఖ్యంగా కవితపై, సీఎం కేసీఆర్ పై పలుమార్లు విమర్శలు చేశారు. అలాంటిది బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ రోజు మెట్‌పల్లిలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Latest Videos

Also Read: ఇండియా కూటమి బాయ్‌కాట్ చేసిన జర్నలిస్టుతో కాంగ్రెస్ లీడర్ కమల్‌నాథ్ ఇంటర్వ్యూ

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ మంచోడని అన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రథమ ప్రత్యర్థి అనే విషయం తెలిసిందే. తెలంగాణలో బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్‌నే బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా చూస్తున్నది. బీజేపీ కూడా రెండంకెల సీట్లను సాధించగలిగే.. హంగ్ ప్రభుత్వం అనివార్యం అవుతుంది. అప్పుడు బీజేపీ.. మిగిలిన రెండు పార్టీల్లో దేనికైనా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. హంగ్ ఫలితాలు వస్తే బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ధర్మపురి అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థం అవుతున్నాయి.

click me!