50 ఏళ్లు పాలించారు కాలువలు తవ్వారా: దద్దమ్మలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 26, 2020, 8:44 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లిలో నియంత్రిత పంటల సాగుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లిలో నియంత్రిత పంటల సాగుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు.

Also Read:కరోనా సంక్షోభంలోనూ రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్ దే.. కేటీఆర్

50 ఏళ్లపాటు కాలువలు కూడా తవ్వలేకపోయారు కానీ దద్దమ్మలు ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా రైతులకు 1200కోట్ల రుణమాఫీ చేశామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

పోతిరెడ్డిపాడు  జీవో ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ రోజు కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు హారతులు పట్టింది ఈ కాంగ్రెస్ నాయకులు కాదా అని మంత్రి నిలదీశారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలని కేటీఆర్ విమర్శించారు. 

Also Read:కరోనా మరణాలపై డౌట్స్: సాక్ష్యం ఇదేనని కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజెన్

కేసీఆర్ ప్రజల కష్టాలు తెలిసిన నేత అని అందుకే వ్యవసాయానికి పెద్దపీట వేశారని, 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నారని అన్నారు. సిరిసిల్లలో 2.5 లక్షల ఎకరాలకు దసరా నాటికి కాల్వల ద్వారా నీరందిస్తాం అన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా పోతిరెడ్డి పాడుపై గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.

click me!