Ask Your KTR : మీరు కేంద్ర ఐటీ మంత్రి కావాలన్న నెటిజన్.. ఇలా సంతోషంగా ఉన్నానంటూ.. స్పందించిన కేటీఆర్...

Published : Jan 14, 2022, 06:37 AM IST
Ask Your KTR : మీరు కేంద్ర ఐటీ మంత్రి కావాలన్న నెటిజన్.. ఇలా సంతోషంగా ఉన్నానంటూ.. స్పందించిన కేటీఆర్...

సారాంశం

ప్రజలు శాంతి, సుస్థిరత కోరుకుంటున్నారని, తమ ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఫైబర్ నెట్ ద్వారా తొలి దశలో 2022 ఏప్రిల్ కల్లా తెలంగాణలోని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యూపీలో ప్రస్తుతం సమాజ్ వాది పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు tweet చేసిన వారికి వెంటనే రీట్వీట్ చేస్తూ.. అవసరమైన సాయాన్ని అందిస్తూ... ఛలోక్తులు విసురుతూ చాలా సరదాగా ఉంటారు. తాజాగా ఆయన ఓ 
Twitter user అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ లో నిర్వహించిన ‘Ask Your KTR’ కార్యక్రమంలో నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. కేటీఆర్ Union IT Minister కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉన్నట్లు కేటీఆర్ సమాధానమిచ్చారు.

ప్రజలు శాంతి, సుస్థిరత కోరుకుంటున్నారని, తమ ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఫైబర్ నెట్ ద్వారా తొలి దశలో 2022 ఏప్రిల్ కల్లా తెలంగాణలోని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యూపీలో ప్రస్తుతం సమాజ్ వాది పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇదిలా ఉండగా, telangana ఐటీ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి KTR మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. పుట్టు మూగ అయిన పంజాబ్  Chess Champion మాలిక హాండాకు మంత్రి కేటీఆర్ ఈ పదకొండో తేదీన వ్యక్తిగతంగా 15 లక్షల Financial assistance అందించారు. అనేక జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించినా.. వైఫల్యం కారణంగా Punjab ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడం లేదని ఆమె ట్విటర్ ద్వారా ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇది చూసిన కేటీఆర్ స్పందించారు. ఆమెను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు దివ్యాంగ సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ, ఇతర అధికారిణులను పంపించి మాలికను సోమవారం జలంధర్ నుంచి ప్రగతి భవన్ లోని తన కార్యాలయానికి Malika Handaను పిలిపించి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆమెకు ల్యాప్ టాప్ నూ బహూకరించారు. కేంద్రం నుంచీ సాయం అందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కోరారు.

అయితే, మంత్రి కేటీఆర్ తరచుగా ఇలాంటి వాటికి స్పందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఉన్నాయి. నిరుడు జూలైలో ఆత్మహత్యకు పాల్పడిన ఐఏఎస్ అభ్యర్ధి ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఆదుకున్నారు. 

గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అత్యంత పేదరిక నేపథ్యం నుంచి ఢిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, ఐశ్వర్య రెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 

అయితే లాక్‌డౌన్ సమయంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు అవసరమైన లాప్‌టాప్ కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకవైపు ఎంచుకున్న తన లక్ష్యం, ఉన్నత చదువు దూరమవుతుందేమోనన్న బాధతో ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu