తెలంగాణలో ఏమాత్రం తగ్గని కేసులు.. కొత్తగా 2,707 మందికి కరోనా, 7,02,801కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 13, 2022, 08:50 PM IST
తెలంగాణలో ఏమాత్రం తగ్గని కేసులు.. కొత్తగా 2,707 మందికి కరోనా, 7,02,801కి చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణలో (corona cases in telangana) గడిచిన 24 గంటల్లో 84,280 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,707 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో (corona cases in telangana) గడిచిన 24 గంటల్లో 84,280 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,707 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయినవారి సంఖ్య 4,049కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 20,462 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1382 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.  

కాగా.. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన రెండున్నర లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ (video conference) నిర్వహించారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల గురించి వారి అభిప్రాయాలు సేకరించారు. వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వ్యాక్సినేషన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను ప్రధాని సమీక్షించారు.

మరోవైపు భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజువారి కొత్త కేసులు సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,47,417 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. అయితే గత 8 నెలల కాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా కరోనాతో 380 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,85,035కి చేరింది. 

దేశవ్యాప్తంగా నిన్న కరోనా నుంచి  84,825 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,47,15,361కి చేరింది. రికవరీ రేటు 95.59 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల శాతం 3.08గా ఉంది. 

ప్రస్తుతం దేశంలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే వీక్లీ పాజిటివిటీ రేటు 10.80 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. బుధవారం దేశంలో 76,32,024 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కి చేరింది. కరోనా పరీక్షల విషయానికి వస్తే.. జనవరి 12న దేశవ్యాప్తంగా 18,86,935 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు మొత్తంగా 69,73,11,627 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా వెల్లడించింది. 
 

PREV
click me!

Recommended Stories

Sammakka Saralamma: మేడారం జాతరలో న్యూజిలాండ్ మావోరి గిరిజనుల ప్రత్యేక పూజలు | Asianet News Telugu
Sammakka Saralamma జాతరలో తీవ్ర ఉద్రిక్తత | పోలీసులతో MLA Kaushik వాగ్వాదం | Asianet News Telugu