రైతన్నల మాదిరే, నేతన్నల ఉద్యమం తప్పదు : కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

Siva Kodati |  
Published : Dec 30, 2021, 08:07 PM IST
రైతన్నల మాదిరే, నేతన్నల ఉద్యమం తప్పదు : కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

సారాంశం

జనవరి ఒకటో తేదీ నుంచి వస్త్ర పరిశ్రమపై (textile industry) విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని, జీఎస్టీ కౌన్సిల్‌లో (gst council) ఈ పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (nirmala sitharaman) మంత్రి లేఖ రాశారు.

జనవరి ఒకటో తేదీ నుంచి వస్త్ర పరిశ్రమపై (textile industry) విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్ (ktr) .  ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని, జీఎస్టీ కౌన్సిల్‌లో (gst council) ఈ పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (nirmala sitharaman) మంత్రి లేఖ రాశారు. వస్త్రాలపై జీఎస్టీ పన్ను పెంపు వల్ల దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమ పూర్తి స్థాయిలో కుదేలవుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.   

Also Read:ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారా ?- ట్విటర్ మంత్రి కేటీఆర్

దేశంలో టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీపై ఆధారపడిన కోట్లాది మంది కార్మికులకు ఈ నిర్ణయం సమ్మెటపోటని కేటీఆర్ అన్నారు. ఇది వారి జీవితాలను పూర్తిగా దెబ్బతీస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. జీఎస్టీ పన్ను పెంపు విషయంలో వస్త్ర పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను, జరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 

లేకుంటే టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ యూనిట్లు నష్టాలపాలై మూతపడే ప్రమాదముందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఒక వేళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే.. వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు తిరగబడిన మాదిరే దేశంలోని నేతన్నలు కూడా తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు. పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకునే వరకు ఈ విషయంలో పారిశ్రామిక వర్గాలకు, దేశంలోని నేతన్నలకు తెలంగాణ తరఫున అండగా ఉంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం