ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు అభివృద్దిలో ముందంజలో ఉన్నాయని మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ తెలిపారు. దక్షిణా భారతంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని. ప్రాంతీయ పార్టీల పాలనలోనే సమగ్ర అభివృద్ధి జరుగుతోందని అన్నారు.
ప్రాంతీయ పార్టీల (Regional parties) పాలనలో ఉన్న రాష్ట్రాలు అభివృద్దిలో ముందంజలో ఉన్నాయని మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ అన్నారు. కన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ (CIFA) నిర్వహించిన సమావేశంలో గురువారం ఆయన పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని. ప్రాంతీయ పార్టీల పాలనలోనే సమగ్ర అభివృద్ధి జరుగుతోందని అన్నారు.
ప్రస్తుతం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పాలిస్తున్నాయని, ఈ రాష్ట్రాల అభివృద్దిలో ప్రాంతీయ పార్టీల పాత్ర మరింత కీలకమైందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని, అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు.ప్రాంతీయ పార్టీలే స్థానిక సమస్యలను సవివరంగా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయని అన్నారు.
undefined
అలాగే.. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. రైతులకు సాగునీటి అవసరాలు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అందించడమే కాకుండా వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి చేసిందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో వ్యవసాయ ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నందున వ్యవసాయ ఎగుమతి విధానాన్ని (ఏఈపీ) కొనసాగించాల్సిన అవసరముందని చెప్పారు. AEP అమలు కోసం పథకానికి యూనియన్ బడ్జెట్ 2021-22 కింద రూ. 100 కోట్ల నిధుల కేటాయింపులు
జరిగాయని తెలిపారు.
తెలంగాణలో వ్యవసాయ ఎగుమతి దృష్ట్యా, తెలంగాణ సామాజిక-ఆర్థిక పురోగతి గత ఐదున్నరేళ్లలో మెరుగ్గా ఉందని, బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులెస్తుందని తెలిపారు. తెలంగాణ నుండి వరి, మొక్కజొన్న, మిర్చి, కందులు, పత్తి ఎగుమతి చేయాలని, ఈ పంటలను మంచి డిమాండ్ ఉందని తెలిపారు. రైతులకు సరుకుల ఎగుమతులపై సరైన అవగాహన లేదనీ, ఉత్పత్తి, నిల్వ, ప్రాసెసింగ్, ఎగుమతి ధరల సమాచారం వంటి సరైన మౌలిక అంశాలపై రైతులకు అవగాహన ఉండాలని తెలిపారు.
Read Also ; Omicron: ఏడాది కింద చూసిన డిసీజ్ కాదు.. ఇది.. : ఆక్స్‌ఫర్డ్ సైంటిస్ట్
అనంతరం.. వ్యవసాయ అధికారుల సంఘం శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టే ముందు మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరముందని తెలిపారు. చాలా మంది రైతులు వరి సాగుకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక గల కారణాలను వివరిస్తూ, వరి సాగుకు తక్కువ మంది సిబ్బంది అవసరమవుతుందని, పైగా రైతులు వరి సాగును సమర్ధవంతంగా చేపట్టేందుకు అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారని చెప్పారు.
రైతుల సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి సారించాలని శ్యామ్ సుందర్ రెడ్డి అన్నారు. CIFA ముఖ్య సలహాదారు పి చెంగల్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న లోపాయికారీ విధానాల వల్ల రైతులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడలేకపోతున్నారని అన్నారు.