తాజ్ మ‌హాల్ ను కూడా తీసివేయ‌మంటారా? బీజేపీపై V Hanumantha Rao ఫైర్

Published : Dec 30, 2021, 06:23 PM IST
తాజ్ మ‌హాల్ ను కూడా  తీసివేయ‌మంటారా?  బీజేపీపై  V Hanumantha Rao ఫైర్

సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గుంటూరులోని పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా ఉన్న ట‌వ‌ర్ కూల్చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడ‌ర్ V Hanumantha Rao (వీహెచ్) స్పందించారు. ప్ర‌జ‌ల దృష్టి మార్చ‌డానికే బీజేపీ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక రేపు రేపు తాజ్ మ‌హాల్ తీసివేయ‌మంటారా? అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ లో చార్మినార్ ఉంది.. దాని ముస్లీంలు క‌ట్టించారు దాని కూడా తీసేయ‌మంటారా? అని ప్ర‌శ్నించారు. పేరు మార్చడం కాదు. ప్ర‌జ‌ల మ‌న‌స్సు గెలుచుకొండ‌ని హిత‌వు ప‌లికారు.   

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గుంటూరులోని పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా టవర్‌ను కూల్చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడ‌ర్   V Hanumantha Rao (వీహెచ్)స్పందించారు. ప్ర‌జ‌ల దృష్టి మార్చ‌డానికే బీజేపీ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసలు జిన్నా పేరు ఎందుకు గుర్తు వచ్చింద‌నీ, కావాల‌నే మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపించారు. ఇక రేపు రేపు తాజ్ మ‌హాల్ తీసివేయ‌మంటారా? అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ లో చార్మినార్ ఉంది.. దాని ముస్లీంలు క‌ట్టించారు దాని కూడా తీసేయ‌మంటారా? అని ప్ర‌శ్నించారు. పేరు మార్చడం కాదు. ప్ర‌జ‌ల మ‌న్న‌ల‌ను పొందండి. వారి గుండెల్లో నిలిచిపోంది అని  బీజేపీకి చుక‌ర‌లు అంటించారు. 

Read Also :పెరుగుతున్న కరోనా కేసులు... సీజ్ చేసిన థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్
 
రాజాసింగ్ ఏమ‌న్నాంటే.. !

గుంటూరులో పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా టవర్‌ను కూల్చేయాలని రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  భారతదేశాన్ని విడదీసిన జిల్లా పేరుతో ఉన్న జిన్నా టవర్ ను కూల్చేయాలన్నారు అలీ జిన్నా భారతదేశానికి చాలా ద్రోహం చేశారని..అటువంటి దేశద్రోహి అలీజిన్నా పేరు టవర్‌కు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. లేదంటే బీజేపీ కార్యకర్తలే టవర్‌ను కూల్చేస్తారిన రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read Also : ఉడుత ఉగ్రరూపం.. రెండు రోజుల్లో 18 మందిపై దాడి.. సోషల్ మీడియాలో బోరుమన్న నెటిజన్లు

Jinnah Tower in Guntur క‌థేంటీ? 

గుంటూరు నగరంలోని ప్రముఖ వ్యాపార కూడలిలో పాకిస్తాన్ జాతిపిత పేరుతో జిన్నా టవర్ నిర్మించారు.  ఏడు దశాబ్దాలు క్రితం నిర్మించిన‌ జిన్నా టవర్ సెంటర్ గుంటుర్ లో మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. భారత స్వాతంత్య్రనికి పూర్వం భారత్ పాకిస్తాన్ లు కలిసే ఉండేవన్న సంగతి తెలిసిందే. స్వాతంత్రానికి పూర్వం ఈ ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండేవి. దేశ స్వాతంత్రం కోసం అనేకమంది నేతలు పోరాడుతున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహమ్మద్ అలీ జిన్నా కూడా పాల్గొన్నారు.  

Read Also :ప్రాంతీయ పార్టీల పాల‌న‌తోనే రాష్ట్రాల‌ అభివృద్ది సాధ్యం ..మాజీ ఎంపీ Vinod Kumar

గుంటూర్ లో  క్విట్ ఇండియా ఉద్య‌మం ఉదృతంగా సాగింది. 1942 లో గుంటూరు ప్రాంతానికి చెందిన‌ లాల్ జాన్ బాషా.. మొహమ్మద్ ఆలీ జిన్నాతో గుంటూరులో భారీ సభ నిర్వహించాలని తలపించారు. బొంబాయి వెళ్లి జిన్నాను కూడా ఆహ్వానించారు. సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేయగా, చివరి నిముషంలో జిన్నా సభకు హాజరు కాలేదు. కానీ ఆయ‌న స్థానంలో జిన్నా స్నేహితుడు జుదా లియాఖత్ అలీఖాన్ ఈసభకు హాజరు అయ్యారు. అయితే సభకు జిన్నా వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా స్మారక స్తూపాని ఆవిష్కరించాలని లాల్ జాన్ బాషా ఆకాంక్షించారు. జిన్నా రాకపోవడంతో సభకు వచ్చిన అప్పటి స్వాతంత్య్ర సమరయోధులు ఈ స్తూపాన్ని ఆవిష్కరించి వెళ్లిపోయారు. ఆనాటి నుంచి గుంటూరు నగరంలో  ఈ ట‌వ‌ర్ ఒక ల్యాండ్ మార్క్ గా  ఉండిపోయింది.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu