రైతులను ఆదుకోవడంలో కేసీఆర్‌ది ప్రపంచ రికార్డు...: కేటీఆర్

By Arun Kumar PFirst Published Nov 1, 2018, 8:48 PM IST
Highlights

తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు బందు వంటి అద్భుత పతకాన్ని తీసుకువచచిందని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి ఖర్చుల కింద ముందే 8వేలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ సాయాన్ని పెంచి రూ.10వేలు అందిచనున్నట్లు కేటీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. 

కల్వకుర్తి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పాలమూరు జిల్లాకు ఏం చేసిందో చెప్పాలన్నారు. వారు చేయని అభివృద్దిని తాము చేసి చూపించి పాలమూరును పచ్చబడేలా చేస్తుంటే వాళ్ల కళ్లు ఎర్రబడుతున్నాయని విమర్శించారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు తమ చెప్పులను క్యలైన్లో పెట్టి ఎదురుచూసిన పరిస్థితులు మీ పాలనలో ఉండేవంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేటీఆర్ మండిపడ్డారు.

 రైతులకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడానికి తాము ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు కేసుల పేరుతో అడ్డుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి కోర్టులో తప్పుడు కేసులు వేసి ఈ ప్రాజెక్టును అడ్డుకోడానికి ప్రయత్నించలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. 

ఇక ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు అక్రమ పొత్తులను ఏర్పాటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.  కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని గతంలో విమర్శించిన టిడిపి ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని గుర్తుచేశారు. ఈ చిత్రవిచిత్రమైన పొత్తులను ప్రజలు సమర్ధించరని అన్నారు. పొరపాటున ఈ కూటమికి ఒక్క ఓటు వేసినా నోట్లో మట్టి పోసుకున్నట్టేనని కేటీఆర్ విమర్శించారు. 

మరిన్ని వార్తలు

అలా అడిగితే ఇలా చెప్పా: చంద్రబాబుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మీద కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతికి ప్రధాని మట్టినీళ్లు, కేసిఆర్ వెనక్కి...: కేటీఆర్

click me!