హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు ప్రతిష్టాత్మక అవార్డు....

By Arun Kumar PFirst Published Nov 1, 2018, 7:32 PM IST
Highlights

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో నగరానికి మణిహారంగా నిలిచింది. హైదరబాదీల ప్రయాణ కష్టాలను తీర్చడానికి నేనున్నానంటూ మెట్రో ముందుకొచ్చింది. ఇలా పిపిపి( పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) పద్దతిలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ అన్ని ఆటంకాలను అధిగమిస్తూ ఒక్కో మార్గంలో ప్రారంభమవుతోంది. 

అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టులో పలు అరుదైన నిర్మాణాలు చేపడుతూ నిర్మాన సంస్థ ఎల్ ఆండ్ టి, హైదరాబాద్ మెట్రో పలు రికార్డులు కైవసం చేసుకుంది. తాజాగా కొన్ని మెట్రో స్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికచేసింది. 

ప్యారడైజ్, రసూల్ పురా మరియు ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబిఎస్) అందించే గ్రీస్ ఎమ్మార్టీఎస్ ప్లాటినమ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఐసిసి లో జరిగిన  ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతులమీదుల మీదుగా ఈ అవార్డును మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మరియు కేవీ రెడ్డిలు కలిసి అందుకున్నారు.    

click me!