ఎర్ర శేఖర్ కి ఊరట: సోదరుడు జగన్మోహన్ హత్య కేసు కొట్టివేత

By narsimha lodeFirst Published May 13, 2022, 3:56 PM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పై హత్య కేసును శుక్రవారం నాడు కొట్టి వేసింది. తన సోదరుడు జగన్మోహన్ హత్య చేసిన కేసులో ఎ1 గా ఎర్ర శేఖర్ ఉన్నాడు.
 

మహబూబ్‌నగర్: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే Erra shekhar పై హత్య కేసును కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.  మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్  సోదరుడు Jagan Mohan 2013 జూలై 18న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఎర్రశేఖర్ ఏ 1 గా ఉన్నాడు.  ఈ కేసులో ఎర్ర శేఖర్ ను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది.

ఉమ్మడి Mahabubnagar  జిల్లా ధన్వాడ మండల పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్  అతని సోదరుడు జగన్మోహన్ లు చింతకుంట సర్పంచ్ పదవిని తమ భార్యలు పోటీ చేయించాలని తల పెట్టారు. ఈ విషయమై ఇద్దరి మధ్య రాజీ కుదరలేదు.

ఎర్ర శేఖర్ భార్య Bhavani , జగన్మోహన్ భార్య ఆశ్విత కూడా సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయమై సోదరుల మధ్య విబేధాలు వచ్చాయి. ఈ విషయమై మాట్లాడేందుకు గాను సోదరుడిని కారులో తీసుకు వచ్చే క్రమంలో మాటా మాటా పెరిగి ఎర్ర శేఖర్ జగన్మోహన్ పై తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపిపట్టుగా అప్పటి ఎస్పీ ప్రకటించారు. ఈ కేసులో ఎర్ర శేఖర్ 2013 ఆగష్టు 27న ఎస్పీ ఎదుట లొంగిపోయాడు.

ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఎర్ర శేఖర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో కొంత కాలం పాటు జైలు శిక్ష అనుభవించిన ఎర్ర శేఖర్ బెయిల్ పై విడుదలయ్యాడు.  జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాాల్లో చురుకుగానే ఉన్నాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.  బీజేపీలోని జిల్లా నేతలతో సఖ్యత లేకపోవడంతో ఎర్ర శేఖర్ ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎర్ర శేఖర్ సన్నాహలు చేసుకొంటున్నారని ప్రచారం సాగుతుంది.

ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర సత్యం జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన హత్యకు గురయ్యాడు. 1995 ఆగష్టు 12న జడ్చర్లలోని ఓ స్కూల్ లో జరుగుతున్న కార్యక్రమంలో ఎర్ర సత్యంపై మాధవరెడ్డి  అనే మాజీ కానిస్టేబుల్  కాల్చి చంపాడు. ఎప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొనే ఎర్ర సత్యం హత్య జరిగిన రోజున మాత్రం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు.  మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఎర్ర సత్యం ఉండేవాడు. 1994లో తొలిసారిగా ఎర్ర సత్యం టీడీపీ అభ్యర్ధిగా జడ్చర్ల నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఎర్ర సత్యం మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎర్ర శేఖర్ జడ్చర్ల నుండి పోటీ చేసి విజయం సాధించారు.

also read:రేవంత్‌తో ఎర్ర శేఖర్ భేటీ: కాంగ్రెస్ చీఫ్ తో పాత టీడీపీ నేతల సమావేశం, ఏం జరుగుతోంది?

గతంలో మహబూబ్ నగర్ నుండి టీడీపీ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించిన పొడపాటి చంద్రశేఖర్ కూడా ఎర్ర శేఖర్ కుటుంబంతో బంధుత్వం ఉంది. పొడపాటి చంద్రశేఖర్ ఎన్టీఆర్, చంద్రబాబ కేటినెట్లలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్ఎస్ కు కేటాయించడంతో చంద్రశేఖర్ పోటీకి దూరంగా ఉన్నారు. 2014 తర్వాత చంద్రశేఖర్ టీడీపీని వీడారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు.
 

click me!