ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు... అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Dec 14, 2021, 1:07 PM IST
Highlights

తెలంగాణలో స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఆరింటికి ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

నల్గొండ: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) జోరు కొనసాగింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆరింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా (nalgonda district)లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందిన ఎంసి కోటిరెడ్డి (MC Kotireddy)కి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి (jagadish reddy) ప్రత్యేకంగా అభినందించారు.  

నల్గొండ జిల్లా నుండి కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన టీఆర్ఎస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr)కి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కోటిరెడ్డికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ శ్రేణుల సమిష్టిగా కష్టపడి విజయం సాధించారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుయుక్తులు పన్నారని... అయినా తమ విజయాన్ని అడ్డుకోలేకపోయాయని అన్నారు. ప్రత్యక్షంగా పోటీ చేయకున్నా ఇండిపెండెంట్ లుగా తమ అభ్యర్థులను నిలబెట్టారని... అయినా టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక బొక్కబోర్లా పడ్డాయని ఎద్దేవా చేసారు. టీఆర్ఎస్ సైనికుల శక్తి ముందు కాంగ్రెస్ (Congress) పలాయనం చిత్తగించిందని మంత్రి విమర్శించారు. 

read more  ఖమ్మం, మెదక్‌లలో పలించిన వ్యూహాం: నల్గొండలో చతికిలపడిన కాంగ్రెస్

ప్రస్తుతం ఎమ్మెల్సీ విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉందని మరోసారి రుజువయ్యిందన్నారు. మరోసారి నల్గొండ జిల్లా గులాబీ కంచుకోట అని నిరూపితం అయిందన్నారు. ఇదే ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ నల్గొండ జిలాలోని 12 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటాము... ప్రతిపక్షాలను తరిమికొడతామని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. 

వ్యవసాయ ఆధార నల్గొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్ఎస్ పాలనలో జిల్లా సస్యశ్యామలం అయిందన్నారు. ఇకపైనా పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు. ఈ ఎన్నిక మాపై మరింత బాధ్యతను పెంచిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుగులేదని... ఆయనంటేనే ప్రజలకు విశ్వాసం, నమ్మకం అన్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకోవడమే దానికి నిదర్శనమన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానమే లేదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

read more  Nalgonda Local body MLC Election: టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డి ఘన విజయం

నల్గొండ ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఎంసి కోటిరెడ్డి మట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన గెలుపుకు కృషిచేసిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రుణపడి ఉంటానని అన్నారు. తనవంతుగా జిల్లా అభివృద్ధికి పాటుపడుతానని కోటిరెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ  ఈ ఎన్నికల్లో  ఘోరంగా  విఫలం అయిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలకు పాల్పడ్డా, నీచ రాజకీయాలు చేసినా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేక పోయారన్నారు. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి ఎల్లపుడూ అండగా వుంటుందని మరోసారి రుజువయ్యిందని కోటిరెడ్డి అన్నారు. 

 

click me!