నూతన జోనల్ విధానం: ఉద్యోగుల కేటాయింపుపై స్టేకి నిరాకరణ

Published : Dec 14, 2021, 12:46 PM ISTUpdated : Dec 14, 2021, 12:49 PM IST
నూతన జోనల్ విధానం: ఉద్యోగుల కేటాయింపుపై స్టేకి నిరాకరణ

సారాంశం

నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ విషయమై ప్రభుత్వం తన వాదనలను తెలపాలని హైకోర్టు కోరింది.

హైదరాబాద్: నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు Telangana High Court మంగళవారం నాడు నిరాకరించింది. తెలంగాణలో New Zonal  విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపునకు  సంబంధించి హైకోర్టులో 226 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది.రాష్ట్రపతి ఉత్తర్వులు, కోర్టు ఆర్డర్స్ కు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. కేటాయింపుల ప్రక్రియ పూర్తిగా నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు.  ఈ విషయమై  ప్రభుత్వ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని  హైకోర్టు స్పష్టం చేసింది.  పిటిషనర్లు లేవనెత్తిన  అభ్యంతరాలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

నూతన జోనల్ విధానానికి 2021ఏప్రిల్‌లో ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా కొత్త జోన్లు, మల్టీజోన్లతో కూడిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 30న వెలువరించింది. 33 జిల్లాలు, 7 జోన్లు 2 మల్టీజోన్లలో జరిగే నియామకాలలో, పదోన్నతులలో కొత్త జోనల్‌ విధానం అమలు చేయాలని 2021 జూలై 22న ఆదేశాలు జారీచేసింది.ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులను యథేచ్ఛ ఉల్లంఘించారు. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌లోని అన్‌ రిజర్వ్‌డ్‌ 20 శాతం,30 శాతం, 40 శాతం పోస్టుల నియామకాలలో నాన్‌ లోకల్‌ను నియమించారు. 


 
 


 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu