దీంతో కూలీల కొరతను అధిగమించవచ్చు.. పొలంలోకి దిగి విత్త‌నాలు చల్లిన‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

By AN TeluguFirst Published Jul 6, 2021, 3:51 PM IST
Highlights

వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేయడం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. 

వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేయడం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. 

మంగ‌ళ‌వారం నిర్మల్ జిల్లా, సోన్ మండలం పాక్ ప‌ట్ల గ్రామంలోని త‌న పొలం వ‌ద్ద మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు పూజ‌ నిర్వ‌హించారు. అనంత‌రం మంత్రి స్వ‌యంగా మ‌డిలోకి దిగి  వ‌రి విత్త‌నాలను వెద‌జ‌ల్లారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...  తెలంగాణ‌లో అనాదిగా వ‌రి నాట్లు వేసే విధానం ఉంద‌ని, అయితే కూలీల కొర‌త‌తో క్ర‌మంగా వరిలో మూస పద్ధతికి స్వస్తి  చెప్పుతూ రైతులు ప్రత్యక్ష సాగుకు ఆసక్తి చూపుతున్నార‌ని తెలిపారు. 

ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే  దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండ‌టంతో ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ నూతన విధానాన్ని ప్రోత్సహిస్తున్నార‌ని తెలిపారు. 

ఈ విధానంలో సాగుద్వారా రైతుకు అనేక లాభాలున్నాయని, కూలీల కొరతను అధిగమించడంతోపాటు పెట్టుబడి ఖర్చూ భారీగా తగ్గుంతుద‌ని పేర్కొన్నారు. . ఇప్పటికే రాష్ట్రంలోని కొందరు రైతులు ఈ పద్ధతిలో వరిసాగు చేస్తూ, అధిక లాభాలు పొందుతున్నారని చెప్పారు. 

వ్య‌వ‌సాయ‌ శాస్త్రవేత్తలుకూడా ‘వెదజల్లే పద్ధతి’ని పాటించాలని సూచిస్తున్నారని, రైతులు కూడా ఇదే విధానాన్ని అవ‌లంభించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో  రైతు బంధు  జిల్లా స‌మ‌న్వ‌య సమితి  క‌న్వీన‌ర్ నల్లా వెంకట్రాంరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

click me!