తెలంగాణ ఏర్పాటయ్యాకే నీటి దోపిడి పెరిగింది: కేసీఆర్ పై ఫైర్

By narsimha lodeFirst Published Jul 6, 2021, 3:37 PM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతే నీటి దోపిడి ఎక్కువైందని నల్గొండ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
 

హైదరాబాద్:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతే నీటి దోపిడి ఎక్కువైందని నల్గొండ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.మంగళవారం నాడు నల్గొండ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. నీటి దోపిడిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు.పోతిరెడ్డి పాడు నుండి 4 టీఎంసీల నుండి 8 టీఎంసీలకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంటే తెలంగాణ సర్కార్ అడ్డుకోకపోవడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ విషయమై తాము ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు.

పీసీసీ చీఫ్ గా ఉండకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు.  తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. సోనియాగాంధీ నియమించిన కొత్త పీసీసీ కమిటీకి అభినందనలు చెప్పారు. సుధీర్ఘకాలం పాటు తనకు పీసీసీ చీఫ్ గా పనిచేసే అవకాశం కల్పించిన సోనియాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన తెలిపారు. పోలీసుల వేధింపులను తట్టుకొని నిలబడ్డ కార్యకర్తలకు సెల్యూట్ అని ఆయన చెప్పారు.

click me!