ఆయనలా గుండాయిజం చేయం .. మైనంపల్లి‌ హనుమంతరావుపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 8, 2023, 3:12 PM IST

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రజలను డబ్బుతో, గుండాయిజంతో భయభ్రాంతులకు గురిచేసేవాడని హరీశ్ రావు ఆరోపించారు. ఆయన లాగా తాము వ్యవహరించలేదని రాజకీయ విమర్శలు చేయాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు చేయకూడదని మంత్రి హితవు పలికారు. 


బీజేపీపై మండిపడ్డారు తెలంగాణ ఆర్ధిక మంత్రి , బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రజలను డబ్బుతో, గుండాయిజంతో భయభ్రాంతులకు గురిచేసేవాడని హరీశ్ రావు ఆరోపించారు. ఆయన లాగా తాము వ్యవహరించలేదని రాజకీయ విమర్శలు చేయాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు చేయకూడదని మంత్రి హితవు పలికారు. 

మల్కాజిగిరి నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని.. ప్రతి నెలా తాను ఇక్కడికి వచ్చి సమస్యలపై దృష్టి సారిస్తానని చెప్పారు. బీజేపీ నేతలు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడతారని హరీశ్ రావు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పథకాలను బీజేపీ కాపీ కొట్టిందని.. రాష్ట్రంలో మంచినీటి సమస్యను తీర్చామని, ప్రతి జిల్లాకు 100 పడకల ఆసుపత్రి ఇచ్చామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గల్లీకో పేకాట క్లబ్బు వుండేదని.. కేసీఆర్ అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులన్నీ మూసేశారని హరీశ్ చెప్పారు. 

Latest Videos

ALso Read: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రాష్ట్రం మొత్తాన్ని అమ్ముకుంటాడు..: కేటీఆర్

ఇకపోతే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన దొంగ  రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటారని ఆరోపించారు. మంగళవారం రోజును ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేను రూ. 50 లక్షలకు కొంటూ రేవంత్ రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని విమర్శించారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడని అన్నారు. 

click me!