
హైదరాబాద్ : తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న బలగం మొగిలయ్యకు మంత్రి హరీశ్ రావు చొరవతో నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. వైద్య శాఖా మంత్రి ఆదేశాల మేరకు నిమ్స్ వైద్య బృందం అత్యున్నత వైద్యం అందిస్తున్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ తో పాటు, బీపీ, షుగర్ తో మొగిలయ్య బాధపడుతున్నారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుండి నిమ్స్ తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న నిమ్స్ వైద్యులు తెలిపారు.
అంతకు ముందు, బలగం ముగ్గులయ్య గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వరంగల్లోని సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. బలగం సినిమాలో పాట ద్వారా విశేష ప్రేక్షకాదరణ నోచుకున్నారు ఆయన. ఆ తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వరంగల్లోని వైద్యులు ఆయనకి డయాలసిస్ చేస్తుంటే గుండెపోటు వచ్చింది.
Balagam Mogilaiah: 'బలగం' మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందిస్తాం : మంత్రి హరీశ్‌రావు
దీంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం మొగిలయ్యను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. బీపీ షుగర్ లతో బాధపడుతున్న బలగం మొగిలయ్యకు ఇప్పటికే రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి.
ఆయన ఆరోగ్య పరిస్థితి మీద మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు .ఈ క్రమంలోనే మొగిలయ్యను వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించాలని అధికారులకు మంత్రులు సూచించారు.