ధర్మం గెలిచిందన్న ప్రశాంత్: కరీంనగర్ జైలు నుండి టెన్త్ క్లాస్ పేపర్ లీక్ నిందితుడు విడుదల

By narsimha lodeFirst Published Apr 12, 2023, 9:43 AM IST
Highlights

టెన్త్ క్లాస్  హిందీ  పేపర్ లీక్   కుట్ర  కేసులో  అరెస్టైన  ప్రశాంత్  ఇవాళ కరీంనగర్  జైలు నుండి  విడుదలయ్యాడు.  ప్రశాంత్  కు  నిన్న  కోర్టు  బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

కరీంనగర్  జైలు  నుండి విడుదలైన తర్వాత  ప్రశాంత్   బుధవారంనాడు  మీడియాతో మాట్లాడారు.  తనకు  కోర్టు  బెయిల్ మంజూరు చేయడం  ధర్మం గెలిచిందన్నారు.  తనపై  పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా  కేసు నమోదు  చేశారని  ఆయన ఆరోపించారు. 

ఈ నెల  4వ తేదీన  ఉదయం  10:05 గంటలకు  వాట్సాప్ లో  టెన్త్ క్లాస్  పేపర్ వచ్చిందన్నారు. తాను  ఉదయం  10:46 గంటలకు తన  పోన్ కు  వచ్చిన  క్వశ్చన్  పేపర్  ను చూసినట్టుగా  ఆయన  చెప్పారు.  ఆ తర్వాత  తనకు  తెలిసిన  జర్నలిస్టు మిత్రులకు  షేర్ చేశానని  చెప్పారు.   తాను బండి సంజయ్ తో  పదే  పదే  ఫోన్ లో  మాట్లాడినట్టుగా  పోలీసులు  చేసిన  ఆరోపణలను  ప్రశాంత్  తోసిపుచ్చారు.  బండిసంజయ్  పీఏ  అందుబాటులో  లేకపోవడంతో  తనను  ప్రెస్ నోట్  రాయాలని తనను కోరారన్నారు.  బండి సంజయ్  తో  ఫోన్ లో  40 సెకన్లు మాట్లాడినట్టుగా   ప్రశాంత్  చెప్పారు.  

ఈ నెల  4వ తేదీ  సాయంత్రం  ఆరు గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని  ప్రశ్నించారని  ప్రశాంత్  గుర్తు  చేసుకున్నారు. తన ఫోన్  లాక్  ఓపెన్  చేసి పోలీసులకు  ఇచ్చినట్టుగా  ప్రశాంత్  గుర్తు  చేసుకున్నారు.   పోలీసుల వద్ద తాను  ఉన్న సమయంలో కూడా  చాలా ఫోన్లు  వచ్చినట్టుగా  ప్రశాంత్  గుర్తు  చేశారు. టెన్త్ క్లాస్  హిందీ  పేపర్ లీక్  అంశానికి  సంబంధించి  తనకు  కరీంనగర్,  వరంగల్,  హైద్రాబాద్  జర్నలిస్టుల నుండి ఫోన్లు  వచ్చినట్టుగా  ప్రశాంత్  చెప్పారు.  రెండు గంటల్లో 144 ఫోన్లు  మాట్లాడినట్టుగా  పోలీసులు  చెప్పిన విషయంలో వాస్తవం లేదన్నారు.  ఇన్ కమింగ్,  అవుట్ గోయింగ్  కాల్స్ ,మిస్డ్  కాల్స్  ను కూడ  కలుపుకుని పోలీసులు చెప్పి ఉంటారని ప్రశాంత్  అభిప్రాయపడ్డారు.  

ఎనిమిదేళ్లుగా  విద్యార్ధుల  కోసం తాను  పోరాటం  చేస్తున్నానని  చెప్పారు.  తాను  పనిచేసిన  సంస్థల్లో  కూడా  విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  వార్తా కథనాలు  రాసిన విషయాన్ని ప్రశాంత్  గుర్తు  చేశారు.  విద్యార్థుల జీవితాలతో తాను ఆడుకుంటున్నట్టుగా  చేసిన ఆరోపణలను  ప్రశాంత్  ఖండించారు. 


 

click me!