ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలా మూస్తారో చూస్తాం: కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

By narsimha lode  |  First Published Nov 30, 2021, 1:26 PM IST


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. 


హైదరాబాద్: యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవని  తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండి పడ్డారు. కొనుగోలు కేంద్రాలను ఎలా మూసి వేస్తావో  చూస్తామని ఆయన హెచ్చరించారు.  మంగళవారం నాడు  హైద్రాబాద్ Bjp  కార్యాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం Kcr కేంద్ర మంత్రి Kishan Reddy పై చేసిన విమర్శలకు సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 

సీఎం పదవిలో ఉన్న వ్యక్తి దిగజారి ఓ కేంద్ర మంత్రిపై నోరు పారేసుకొన్నారన్నారు. సీఎం కేసీఆర్ తీరును అందరూ ఛీ కొడుతున్నారన్నారు. Delhi వెళ్లి వచ్చాక కేసీఆర్ కు పిచ్చి ఇంకా  ముదిరిందని చెప్పారు.  Cabinet  సమావేశంలో  బూతులు ఎలా మాట్లాడాలనే విషయమై చర్చించారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.  రా రైస్ కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.  వర్షాకాలంలో రైతులు పండించిన Paddy కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మనపై కేంద్రం పెత్తనం ఏంటని కేసీఆర్ ప్రశ్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రైతుల నుండి ధాన్యాన్నే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఫోజులు కొట్టారని కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. 

Latest Videos

undefined

రైతులు పండించిన  ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  యాసంగిలో కూడా  ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకుండా చేయాలని కేసీఆర్  చాలా కాలంగా కుట్రలు పన్నారన్నారు. 2020 డిసెంబర్ మాసంలో పత్రికలో వచ్చిన కేసీఆర్ స్టేట్ మెంట్ ను బండి సంజయ్ మీడియా సమావేశంలో చదివి వినిపించారు.  ఇతర రాష్ట్రాలకు రాని సమస్య తెలంగాణకే ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. 

also read:పార్లమెంట్‌లో టీఆర్ఎస్ డ్రామాలు: వరి ధాన్యం కొనుగోలుపై రేవంత్ రెడ్డి

బాయిల్డ్ రైస్  ను గతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రంలో తినేవారు అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో తినడం లేదన్నారు. తినని వాళ్లను బలవంతంగా తినిపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. మెడపై కత్తి పెడితే  ఏమైనా రాసి ఇస్తావా అని ఆయన అడిగారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈ విషయమై ఎందుకు ప్రశ్నించలేదు. మోడీని కలిసిన సమయంలో ఎందుకు ఈ విషయమై ఎందుకు చెప్పలేదన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈ విషయమై ఎందుకు ప్రశ్నించలేదు. మోడీని కలిసిన సమయంలో ఎందుకు ఈ విషయమై ఎందుకు చెప్పలేదన్నారు. మెడపై కత్తి పెడితే ఫామ్ హౌస్ రాసిస్తావా అని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు.ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కేంద్రంపై కేసీఆర్ చేసిన విమర్శలకు అంతే ధీటుగా బీజేపీ నేతలు సమాధానం చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు.  వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాజకీయంగా పై చేయి సాధించేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

click me!